Toe Rings: స్త్రీలు కాళ్లకు మెట్టెలు పెట్టుకోవడం వెనుక కారణాలు ఇవే?

సాధారణంగా పెళ్లి కానీ మహిళలు పెళ్లి అయిన మహిళలు ధరించే ఆభరణాలలో కొన్ని మార్పులు ఉంటాయని చెప్పవచ్చు. పెళ్లి కానీ అమ్మాయిలు ఒక రకమైన ఆభరణాలు

  • Written By:
  • Updated On - June 13, 2023 / 08:18 PM IST

సాధారణంగా పెళ్లి కానీ మహిళలు పెళ్లి అయిన మహిళలు ధరించే ఆభరణాలలో కొన్ని మార్పులు ఉంటాయని చెప్పవచ్చు. పెళ్లి కానీ అమ్మాయిలు ఒక రకమైన ఆభరణాలు తెలిస్తే పెళ్లి తర్వాత అమ్మాయిలకు ఇంకా కొన్ని ఆభరణాలు ఎక్కువగా ధరించాల్సి ఉంటుంది. స్త్రీకి వివాహంతో వచ్చే అలంకారాలలో మెట్టెలు లేక మట్టెలు కూడా ఒకటి. అందుకే చాలామంది ఒక స్త్రీకి పెళ్లి అయిందా లేదా అని అడగకుండా తెలుసుకోవటానికి పాదాల వంక చూస్తారు. ఒకవేళ కాలికి మెట్టెలు ఉంటే ఆమెకు పెళ్లయింది అని అర్థం. అయితే ప్రస్తుత రోజుల్లో కాలం మారిపోవడంతో చాలామంది అమ్మాయిలు ఫ్యాషన్ పేరుతో మంగళసూత్రాన్ని ధరించడం లేదు.

మంగళసూత్రం విషయం పక్కన పెడితే కనీసం కాలికి మెట్టెలు కూడా వేసుకోవడం లేదు. పెళ్ళిలో ఆడపిల్లలకు పెట్టే కాలిమెట్టెలు ఎప్పటికీ అలాగే ఉండాలని చెబుతూ ఉంటారు. అయితే మాములుగా మనం నడిచినప్పుడు పాదం మొత్తం నేలపై మోస్తుంది కానీ వేళ్లు మాత్రం మధ్య భాగంలో కాస్త గ్యాప్ వస్తుంది. ఆ భాగంలోనే నాడీ కేంద్రాలు ఉం టాయి. వాటిని సుకుమారంగా ఒత్తినట్టైతే నాడులు చురుకుగా పని చేస్తాయి. కాలి బొటన వేలికి ప్రక్క వేలు క్రింది భాగంలో ఉన్న నాడీ కేంద్రం గర్భాశయానికి సంబంధించింది. వివాహితులు మట్టెలను ధరించడం వల్ల రుతుస్రావం సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది.

అలాగే ఆయుర్వేదం ప్రకారం బొటన వేలు పక్క ఉండే వేలుతో గర్భాశయానికి సంబంధం ఉంటుంది. మెట్టెలను ఈ వేలుకు ధరించడం వల్ల గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడి, జననేంద్రియాల సమస్యల నుంచి బయటపడవచ్చు. కాగా మెట్టెలు ఆక్యుప్రెజెర్ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే నరాలపై ఇవి ఒత్తిడి తీసుకువస్తాయి. దీని వల్ల మహిళల్లో సంతాన సామర్థ్యం మెరుగుపడుతుంది. సాధారణంగా పెళ్లికి ముందు అమ్మాయిలకు ఉన్న చాలా గైనిక్ సమస్యలు పెళ్లయ్యాక తగ్గుతూ వస్తాయి. అందుకు కారణాలెన్నో వాటిలో కాలివేలికి పెట్టే మెట్టెలు కూడా ఒక కారణం. సంతానలేమి సమస్య ఉన్న పురుషులకు కాలి వేలికి రాగితీగను గట్టిగా చుడతారు. ఇలా ఒత్తిడి కలిగించడం వల్ల ఆ సమస్య నివారణ అవుతుంది. మెట్టెలు వెండితో తయారు చేస్తారు. వెండి అత్యుత్తమ విద్యుత్ వాహకం. ఇవి భూమిలోని శక్తిని శోషణం చేసుకుని శరీరానికి అందిస్తాయి. దీంతో శరీర వ్యవస్థ పునరుత్తేజితం అవుతుంది. అంతేకాదు శరీరంలోని ప్రతికూలతలను బయటకు పంపుతుంది. మన ఆచారాలు, సంప్రదాయాల వెనుక ఆరోగ్య రహస్యాలెన్నో ఉన్నాయి. కాబట్టి మెట్టెలు కేవలం అలంకారం కోసం పెళ్లి అయ్యిందో లేదో తెలుసుకోవడం మాత్రమే కాదు ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి.