Ashadam: ఆషాడమాసంలో నవ దంపతులు దూరం ఉండడం వెనుక కారణం ఇదే?

భారతదేశంలో హిందువులు పెళ్లి విషయంలో ఎన్నో రకాల ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను ఇప్పటికి పాటిస్తూనే ఉన్నారు. పెళ్లికి ముందు అలాగే పెళ్లి తర

  • Written By:
  • Publish Date - July 20, 2023 / 07:30 PM IST

భారతదేశంలో హిందువులు పెళ్లి విషయంలో ఎన్నో రకాల ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను ఇప్పటికి పాటిస్తూనే ఉన్నారు. పెళ్లికి ముందు అలాగే పెళ్లి తర్వాత ఎన్నో రకాల నియమాలను పాటిస్తూనే ఉన్నారు. అటువంటి వాటిలో పెళ్లి తర్వాత వచ్చే ఆషాడ మాసం కూడా ఒకటి. ఆషాడ మాసం వచ్చింది అంటే చాలు కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారి ఇంట్లో ఉండకూడదని, అత్త మొహం చూడకూడదని అంటారు. అంతేకాకుండా ఆ మాసం అంతా వెళ్లిపోయే వరకు పుట్టింటిలోనే ఉండాలని చెబుతూ ఉంటారు. ఇప్పటికీ ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు కొత్త కోడలిని పుట్టింటికి పంపించేస్తుంటారు.

అయితే ఇలా ఎందుకు చేస్తారు, దీని వెనుక ఉన్న కారణం ఏంటో అన్నది చాలామందికి తెలియదు. మరి అలా ఆషాడ మాసంలో కొత్త పెళ్లికూతురుని పుట్టింటికి పంపించడం వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొత్తగా పెళ్లయిన జంటను వారి మొహం ప్రపంచం నుంచి కాస్త బయటకు తీసుకురావడానికి ఆషాఢం మాసం పేరుతో కొంత గ్యాప్ ఇస్తారు. దీని ద్వారా ఇద్దరి మధ్య కాస్త ఎడబాటు ఏర్పడి మరింత విరహ వేదన ఏర్పడుతుంది. అది ఇద్దరి మధ్య బలమైన సంబంధానికి, దాంపత్యానికి దారి తీస్తుందని పెద్దల నమ్మకం. అయితే ఇదే కాకుండా మరికొన్ని కధనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆషాఢ మాసం అనేది వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే సమయం.

ఇది వరకు చాలా కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి బతికేవి. ఇక ఆషాఢమాసం పక్షం రోజులల ముందే జ్యేష్ఠ్య పౌర్ణమిని ఏరువాక పున్నమిగా పిలుస్తారు. వర్షాకాలం ప్రారంభం అయ్యే సమయం కాబట్టి అప్పుడే దుక్కి దున్నడం మొదలవుతుంది. కాబట్టి కొత్తగా పెళ్లైన పురుషుడు భార్య పక్కనే ఉంటే ఇతర పనులపై శ్రద్ధ పెట్టలేడు. కాబట్టి వైవాహిక జీవితం నుంచి అతని ధ్యాస మళ్లించేందుకు భార్యను పుట్టింటికి పంపించేవారు. ఇందుకోసమే అత్త మొహం చూడకూడదనే నియమాన్ని పెట్టారు. ఇవే కాదండోయ్ మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అషాఢంలో భార్యాభర్తల కలయిక వల్ల గర్భం దాల్చితే వేసవిలో ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది. గతంలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు లేక వేసవిలో నానా అవస్థలు పడేవారు. పుట్టిన పిల్లలు, బాలింతలు అయితే మరింత అవస్థ పడేవారు. అందుకే వారు కలవకుండా ఉండేందుకు అమ్మాయిని పుట్టింటికి పంపేవారు. ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్త మొహం చూడకూడదు అన్న దాని వెనుక ఇన్ని కథలు ఉన్నాయి.