Site icon HashtagU Telugu

Non Veg: మంగళవారం మాంసం తింటున్నారా.. అయితే ఇక అంతే సంగతులు?

Monsoon Alert

Monsoon Alert

భారతదేశంలో హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ఆ విధంగా మంగళవారం రోజున హనుమంతునికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. మంగళవారం రోజు ఆంజనేయస్వామికి అంకితం చేయబడింది. మంగళవారం రోజున మూగ ప్రాణాలను చంపడం వల్ల పాపం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి. మంగళవారం రోజున మాంసం తినడం వల్ల ఆ పాపం ఆ రోజు మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. శనివారం ఎలా అయితే మాంసం తినకుండా ఉంటారు అదేవిధంగా మంగళవారం రోజు కూడా మాంసం తినకుండా ఉండాలి. మరి మంగళవారం రోజున మాంసాహారం తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని పూజించేవారు మాంసాహారాన్ని తినడం వల్ల ఆంజనేయ స్వామి ఆవేదనచెందుతాడు. ఫలితంగా ఆంజనేయస్వామిని పూజించడం వల్ల కలిగే ఫలితాలకంటే ఆర్థిక నష్టాలు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి తరచుగా పూజిస్తూ ఉండడం వల్ల వారికి ధైర్యం పెరుగుతుంది. వారిపైన వారికి నమ్మకం పెరిగి అనుకున్న పనులు సాధించగలరు. అయితే ఇవన్నీ కూడా సాధ్యం అవ్వాలి అంటే తప్పనిసరిగా మంగళవారం రోజు మాంసాహారం తినకుండా ఉండాలి. ఆంజనేయ స్వామి మంగళవారం రోజు చూసినా కొలిచినా పూజించినా ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి తన భక్తులను త్వరగా కరుణిస్తారు.

ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు తపస్సులు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే మంగళవారం రోజున మాంసాహారం తింటే కుటుంబంలో సంతోషానికి బదులుగా దుఃఖం పెరిగే అశాంతి నెలకొంటుంది. క్రమంగా ఆర్థిక సమస్యలు కూడా వెంటాడుతాయి. మంగళవారం రోజు ఎంత ఇష్టమైన తులసిమాలను సమర్పించి జైశ్రీరామ్ అని రాసి ఉండే ఎర్రటి జెండాను స్వామి ముందు నిలబెట్టాలి. వీటితోపాటుగా కాషాయ కుంకుమ మల్లెపూల తైలం,ఎర్రటి మిఠాయి ఆంజనేయ స్వామి సంతోషించి తప్పకుండా అనుగ్రహిస్తాడు.

Exit mobile version