Site icon HashtagU Telugu

Non Veg: కార్తీకమాసంలో నాన్ వెజ్ తింటున్నారా.. అయితే ఇది మీకోసమే!

Non-Veg Food

Non-Veg Food

మామూలుగా పండుగలు శుభకార్యాలు అలాగే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన మాసాల్లో నాన్ వెజ్ తినకూడదని ఇంట్లో పెద్దలు పండితులు చెబుతూ ఉంటారు. ఇక కార్తీకమాసం మాఘమాసం శ్రావణమాసం వంటి మాసాలలో చాలామంది నెలల తరబడి ఈ నాన్ వెజ్ ను తినకుండా ఉంటారు. కొందరికి ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు. అలాంటి వారు ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా ఇలాంటివి ఏమి పట్టించుకోకుండా కార్తీకమాసంలో కూడా నాన్ వెజ్ తింటూ ఉంటారు. అయితే కార్తీకమాసంలో నాన్ వెజ్ తినకూడదు అని చెప్పడం వెనుక చాలా కారణాలు ఉన్నాయట.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నాన్ వెజ్ అంటే..ఓ ప్రాణిని చంపి తినడమే. ఒక జంతువుని చంపాలని అనుకునేవాడు, చంపమని చెప్పేవాడు, చంపేవాడు, మాంసం అమ్మేవాడు, కొనేవాడు, తీసుకెళ్లేవాడు, వండేవాడు, తినేవాడు.. ఈ ఎనిమిది మందికి హింసాదోషం తప్పదు. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనలో అహింసకి అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది. ఇలా ఒక పాపంలో ఎంతమంది భాగం ఉంటుందో అంత మందికి పాపం చుట్టుకున్నట్టే అని ఒక పుణ్య కార్యంలో భాగం అయ్యే అందరకీ పుణ్యంలో ఫలితం ఉంటుంది. ఎవరైతే ప్రాణులని చంపడానికి గానీ, బంధించడానికి గానీ, వాటిని బాధ పెట్టడానికి గానీ ఇష్టపడరో ఎవరైతే ప్రాణుల హితం కోరుతారో వాళ్లు అనంతమైన సుఖాలను అనుభవిస్తారట.

మాంసం తిన్నవాడు, పెట్టిన వాడు, వండిన వాడు, అమ్మిన వాడు, ప్రాణికి చంపిన వాడు, అవయవములు ముక్కలుగా చేసినవాడు, దానికి అనుమతినిచ్చినవాడు, ఇలా అందరూ ఆ జీవిని చంపినవాళ్లే అవుతారని చెబుతున్నారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే చలికాలం ప్రారంభమయ్యే సమయంలో ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. మనుషుల శరీరంతో పాటు జంతువుల శరీరంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి . అలాంటి జంతువుల మాంసాన్ని తినడం వల్ల అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే. వాతావరణం మందంగా ఉండే ఈ సమయంలో తేలికపాటి ఆహారం మాత్రమే జీర్ణం అవుతుందట. సరిగా జీర్ణం కానీ, మసాలాలు వినియోగించిన నాన్ వెజ్ తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతారు. జీర్ణసంబంధిత సమస్యలు ఎదురవుతాయట. అందుకే కార్తీక మాసం నెలరోజులు శాఖాహారం మితంగా తీసుకోవాలట.