Lord Ganesh: వినాయకుడికి ఎవరితో వివాహం జరిగింది.. ఆయనకు ఎంతమంది భార్యలో తెలుసా?

భారతదేశంలో హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టినా కూడా మొదటగా గణపతికి పూజ చేసి ఆ తర్వాత ఆ పనులను ప్రారంభిస్తూ ఉంటారు. అయితే వి

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 09:00 PM IST

భారతదేశంలో హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టినా కూడా మొదటగా గణపతికి పూజ చేసి ఆ తర్వాత ఆ పనులను ప్రారంభిస్తూ ఉంటారు. అయితే వినాయకుడు బ్రహ్మచారి అని తనకు పెళ్లి జరగలేదని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయకుడు బ్రహ్మాచారిగా ఉండాలని కోరుకున్నాడట. కానీ వినాయకుడికి ఒకరితో కాదు ఏకంగా ఇద్దరు మహిళలతో వివాహం జరిగిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. దైవిక యోగం ద్వారా ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడట. వారి పేర్లే రిద్ధి , సిద్ధి. ఈ సందర్భంగా వీరిద్దరూ వినాయకుడిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు. విఘ్నేశ్వరుడికి పెళ్లి అయ్యింది అన్న విషయం చాలా మందికి తెలియదు. మరి విఘ్నేశ్వరుడి పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాల విషయానికొస్తే..

పురాణాల ప్రకారం, వినాయకుడు ఒక ప్రశాంతమైన ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉండగా ఆ సమయంలో అటుగా వెళ్తున్న తులసి గణేశుడిని చూసి ఆకర్షితురాలవుతుంది. అంతేకాకుండా వినాయకుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ ఆమె బ్రహ్మచారి అని చెప్పి వినాయకుడు తన వివాహ ప్రతిపాదన తిరస్కరించాడు. అయితే తనతో పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన వినాయకుడిపై తులసి కోపంతో తనకు శాపం విధించింది. గణేశుడిని ఒకటి కాదు ఏకంగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలని శపించింది. వినాయకుడు కూడా తులసికి అసురుడితో వివాహం జరుగుతుందని శపించాడు. అందుకే వినాయకుని పూజలో తులసిని వాడకూడదని పండితులు చెబుతారు. ఇది ఒక కథనం అయితే. మరో కథనం ప్రకారం.. వినాయకుడు తన రూపం, ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడట. ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చింది.

తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తనను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో కలత చెందిన వినాయకుడు బ్రహ్మచార్యం పాటించడం ప్రారంభించాడు. దీంతో కోపోద్రిక్తుడైన గణేశుడు పెళ్లి జరగకుండా ఇబ్బందులను కలుగ జేసేవాడు. వినాయకుడు తనకు పెళ్లి జరగకపోతే.. ఇంకా ఎవరికీ వివాహం జరగకూడదని భావించాడు. ఇందుకు వినాయకుడికి మూషిక మద్దతు కూడా లభించింది. అయితే వినాయకుడి ఈ అలవాటు వల్ల దేవతలందరూ కలత చెందారు. తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. అప్పుడు బ్రహ్మ యోగం నుండి ఇద్దరు కుమార్తెలు రిద్ది, సిద్ధి కనిపించారు. వారిద్దరూ బ్రహ్మదేవుని మానస పుత్రికలు. దేవతల కష్టాలు తీర్చేందుకు తన కుమార్తెలను వినాయకుడి వద్దకు బోధనల కోసం పంపారు. బ్రహ్మదేవుని ఆదేశాల మేరకు గణేశుడు వారికి బోధనలు ప్రారంభించాడు.

ఇక వినాయకుడి దగ్గర పెళ్లికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు, వారిద్దరూ తన ద్రుష్టిని మరల్చేవారు. ఇలా అందరూ క్రమంగా పెళ్లి చేసుకోవడం ప్రారంభించారు. ఒకరోజు అందరూ వివాహం చేసుకున్నారని, చేసుకుంటున్నారని వినాయకుడికి తెలిసిపోతుంది. దీంతో గణపతి సిద్ధి, రిద్దిపై కోపంతో శపించడం మొదలుపెట్టాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి తనను అడ్డుకుంటాడు. అదే సమయంలో వారిద్దరినీ వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాడు. ఆ తర్వాత వీరిద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వీరికి శుభ్, లభ్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు.