Hanuman’s Bell: ఆంజనేయస్వామి తోకకు గంట ఎందుకు ధరించాడో తెలుసా…?

శ్రీరామ భక్తుడు, అభయప్రదాకుడు హనుమంతుని విగ్రహం లేని ఊరు ఉండదు, ఆయన్ని పూజించని హిందువు ఉండడు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిఒక్కరికి హనుమ గుర్తుకు వస్తాడు. హనుమమ గురించి చెప్పుకోవడానికి ఎంతో ఉన్నా సరే ఆయన గురించి ప్రస్తావన వస్తే మాత్రం రామభక్తుడిగానే చూస్తారు.

Hanuman’s Bell: శ్రీరామ భక్తుడు, అభయప్రదాకుడు హనుమంతుని విగ్రహం లేని ఊరు ఉండదు, ఆయన్ని పూజించని హిందువు ఉండడు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిఒక్కరికి హనుమ గుర్తుకు వస్తాడు. హనుమమ గురించి చెప్పుకోవడానికి ఎంతో ఉన్నా సరే ఆయన గురించి ప్రస్తావన వస్తే మాత్రం రామభక్తుడిగానే చూస్తారు. గదను పట్టుకున్న వీరాంజనేయునిగా, చేతులు జోడించివున్న దాసాంజనేయునిగా, అభయముద్రతో అభయాంజనేయునిగా, రామనామస్మరణాసక్తుడైన ప్రసన్నాంజనేయునిగా, లక్ష్మణప్రాణదాయకుడైన సంజీవనగిరిధారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు. ఆంజనేయస్వామిని వివిధ రకాల పేర్లతో, ఆకారాలతో పిలిచి పూజిస్తారు. అందులో స్వామివారి తోకకు గంట ఉండే ఆకారం అందర్నీ ఆకట్టుకుంటుంది. నిజానికి హనుమ తోకకు గంట ఉండటానికి గల కారణం చాలా మందికి తెలియదు. కానీ దాని వెనుక మహా యుద్ధం దాగి ఉంది. తోకకు గంట ఊరికే రాలేదు. తన తోకకు గంట కట్టుకుని 1000 మంది సింగిలీకులను కాపాడాడు.

యుద్ధభూమిలో వనరులు భయంకరంగా పోరాటం చేస్తున్నారు. సీతమ్మను పడాలన్నా ఏకైక లక్ష్యంతో వారు శత్రువులను చీల్చి చెండాడుతున్నారు. రావణ సైన్యాన్ని మట్టుబెట్టారు. చివరికి మిగిలింది కుంభకర్ణుడు, రావణాసురుడు మాత్రమే. కుంభకర్ణుడు భారీ దేహం గురించి మనకు తెలిసిందే. పెద్ద రథంపై కూర్చొని యుద్ధ భూమిలోకి అడుగు పెడతాడు . రాముడు తన బాణంతో కుంభకర్ణుడిని సంహరించగా ఆయన కింద పడుతున్న సమయంలో చేయి రథానికి తగులుతుంది. అప్పుడు రథానికి అలంకరించి ఉన్న ఒక గంట కింద పడుతుంది. ఈ గంట కింద సింగలీక వానర సైన్యం చిక్కుకుంది. అంతపెద్ద గంట కింద వారు చిక్కుకోవడంతో చీకటి కమ్ముకుంటుంది. బయట ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉన్న ఆ వానర సైన్యం వారి గురించి పట్టించుకునే వారే లేరని రాముడిని ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటారు. యుద్ధం ముగుస్తుంది. సీతమ్మను రక్షించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో రాముడు అందరూ ఉన్నారా లేదా అని గమనించగా 1000 మంది సింగిలీకులు కనిపించరు. అప్పుడు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చిన మాట గుర్తొచ్చి ఎంతో బాధపడతాడు. కానీ ఎలాగైనా సింగిలీకులను తీసుకునే వెళ్ళాలి అని అనుకుంటాడు. స్వయంగా ఆ శ్రీ రాముడే రంగంలోకి దిగి సింగిలీకుల కోసం ఆ లంకంత వెతుకుతాడు.

We’re now on WhatsAppClick to Join

అప్పుడు తన మేధాశక్తితో ఒక్క క్షణం ఉన్నచోటే ఆగి గంటని చూస్తూ ఉండిపోతాడు. వానరులు శ్రీరాముని వంక దీనంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు రాముడు హనుమ అని బిగ్గరగా పిలుస్తాడు. దాంతో రామభక్తుడు హనుమ క్షణాల్లో వాలిపోతాడు. రాముడు ఎం చెప్పకుండానే తనలోని భావాన్ని అర్ధం చేసుకుని తోక ద్వారా గంటను పైకి లేపాడు.గంట కింద వెయ్యి మంది సింగిలీకులు ఉండటం చూసి అందరూ సంతోషిస్తారు. రాముడిని తప్పుగా భావించిన సింగిలీకులు శ్రీరాముడి ముందు మోకరిల్లు మనసులో క్షమాపణలు కోరతారు. అప్పుడు రాముడు సింగీళికులని హత్తుకున్నాడు.

ఇప్పటినుంచి ఆంజనేయ స్వామి తోక వెనుక భాగాన గంట ఉన్న ఆంజనేయుడిని ఎవరైతే పూజిస్తారో వారిపై నా అనుగ్రహం నా కృప రెండింతలు ఉంటుందని శ్రీరామచంద్రుడు తెలిపారు. ఆంజనేయుడి తోక వెనుకభాగం గంట ఉండటానికి అసలు కారణం ఇదేనని రామాయణం చెబుతోంది.

Also Read: Devotional: ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఏడాదిలో ఎటువంటి పనులు చేయాలి? ఏం చేయకూడదో తెలుసా?