Site icon HashtagU Telugu

Bell: ఇంట్లో గంటను మోగిస్తే దుష్టశక్తులు దరిచేరకుండా ఉంటాయా!

Bell

Bell

మామూలుగా మనం ఇంట్లో లేదా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుళ్లకు హారతి వచ్చినప్పుడు అలాగే ఇతర సందర్భాలలో గంటను మోగించడం మనం చూసే ఉంటాం. నైవేద్యం సమర్పించినప్పుడు అగరబత్తీలు వెలిగించినప్పుడు హారతి ఇచ్చినప్పుడు, ధూపం వేసినప్పుడు ఇలా చాలా సందర్భాలలో గంటలు కొడుతూ ఉంటారు. వెళ్ళినప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత గంట కొడతాము. పూజారి గుళ్ళో దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతారు. హారతి తరువాత ఒక గంట కొడతారు. అసలు గంటను ఆ విధంగా ఎందుకు కొడతారు? ఇంట్లో గంటను మోగిస్తే దుష్టశక్తులు దరిచేరకుండా ఉంటాయా? ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గంటను మోగించినప్పుడు ” ఓం” అనే ప్రణవనాదం వినిపిస్తుంది. ఆ గంటానాదం మనలో ఉన్న చింతలన్నింటినీ పాల ద్రోలి మనసును దైవం వైపునకు మరల్చుతుంది. గంట అంటే మండపం లోని గంట దేవుడిని దర్శిస్తున్న వ్యక్తి చెవిలో ఓం కార ధ్వనిని నింపడానికి ఉపయోగించే గంట. ఆ గంటను అలాంటి గంటను దేవుడికి ఎదురుగా మండపంలో ఉన్న గంటను హారతి ఇచ్చేటప్పుడు మోగించకూడదు. ఎందుకంటే ఆ ఓంకార నాదానికి సమానమైన అనుకరణ ధ్వనిని లోలో పల వింటూ మాత్రమే దైవాన్ని దర్శించాలట. హారతి ఇచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతామో అన్న విషయానికి వస్తే.. దేవతలందరినీ ఆహ్వానిస్తున్నాము అని చెప్పడానికి, ఆ దైవాంశ ఆ విగ్రహంలోకి చేరాలని ప్రార్థిస్తున్నామని, ఆ దైవాంశ విగ్రహంలోకి చేరినపుపడు ఉన్న రూపాన్ని హారతి వెలుగులో ఆలయంలో చూపడం జరుగుతోందని తెలుపుతుంది హారతి గంట.

అందువల్ల హారతి ఇచ్చే సమయంలో దేవుడిని ప్రత్యక్ష దైవాంశ చేరిన రూపంగా దర్శించాలని చెబుతున్నారు. గంట నాలుక లో సరస్వతీ మాత కొలువై ఉంటుందట. గంట ఉదర భాగంలో మహారుద్రుడు, బ్రహ్మదేవుడు ముఖ భాగంలోను, కొన భాగంలో వాసుకి, పైన వుండే పిడి భాగంలో ప్రాణశక్తి వుంటుందట. నిత్యం పూజ చేసేటప్పుడు గంటను తప్పనిసరిగా ఉపయోగిస్తాం. గంట శబ్దం ఎంత దూరం వరకైతే వినిపిస్తుందో, అంతదూరం వరకూ దుష్ట శక్తులు ప్రవేశించలేవని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ప్రతి దేవాలయంలోను గంటలు వరుసగా వేళ్లాడదీసి కనిపిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించిన తరువాత తిరిగి వెళుతున్నప్పుడు మాత్రమే గంటను మోగించాలనే నియమం ఉంది. గంట శబ్దం శుభాన్ని సూచిస్తుంది.

పూజా మందిరాల్లో చిన్నగంటలను ఉపయోగిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. పూజలో దైవ చిహ్నంగల గంటను మాత్రమే ఉపయోగించాలని శాస్త్రం చెబుతోంది. ఒక్కో దైవ చిహ్నం కలిగిన గంటను మోగించడం వలన ఒక్కో ఫలితం ఉంటుంది. అలాగే గంటను ఇష్టానుసారంగా గందరగోళంగా కాకుండా లయబద్ధంగా మోగించాలట. అలాగే ముఖ్యంగా ధూప, దీప నైవేద్యాల సమయంలో, హారతినిచ్చే సమయంలోను గంటను తప్పనిసరిగా మోగించాలట. ఈ విధమైన నియమాలను పాటిస్తూ గంటను మోగించడం వలన పూజకి సంబంధించిన ఫలితం పరిపూర్ణంగా పొందడం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.