పూజ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పువ్వులు. పూలు లేకుండా దాదాపుగా దేవుడికి చేసే పూజ పూర్తి అవ్వదు. అలా పూలు లేకుండా చేసే పూజ కూడా దేవుడికి ఎక్కదని చెబుతుంటారు. ఈ ప్రకృతిలో అత్యంత అందమైన విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి పువ్వులే ఆ తర్వాతే ఏమైనా అని చెప్పాలి. ప్రకృతిలో ఉండే గడ్డి పువ్వులో కూడా అందం దాగి ఉంటుందని. పూలను దేవుని సమర్పించడం ద్వారా, ఈ ప్రకృతిలోనే అందమైన విషయాన్ని దేవునికి సమర్పించిన భావన కలుగుతుంది.
పూలను సమర్పించే విధానం అనుసరించి, భక్తుడు ఎంత భక్తి ప్రపత్తులను, నియమ నిష్ఠలని కలిగి ఉన్నాడో అన్నది తెలుస్తుంది. అయితే నియమ నిష్టలతో దేవునికి ప్రేమగా పూలను సమర్పించిన భక్తుని పట్ల దేవుని కృప ఎన్నడూ ఉంటుంది. ద్వారా ఆర్ధిక సమస్యలు లేకుండా, మానసికంగా, శారీరికంగా, స్నేహితుల కుటుంబ సంబంధాల పరంగా సమస్యలను దూరం చేసి, క్రమంగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగేలా ఆశీర్వదిస్తాడని భక్తుల ప్రఘాడ విశ్వాసం. పూలలో అంతర్లీన అందం, ఆకర్షణ దాగి ఉంటుంది. వాటి సువాసన పూజలో ఒకరకమైన సానుకూల దృక్పధాలను కలిగేలా చూస్తుంది. తద్వారా మానసిక ప్రశాంతత చేకూరి, ఏకాగ్రత పెరగడానికి కారణం అవుతుంది.
ద్యానం, మంత్రోచ్చారణలు తోడైతే పూజా ఫలం మరింత ఎక్కువగా ఉంటుంది. పూజ అనే పదంలో మొదటి అక్షరం పుష్పాన్ని సూచిస్తే, రెండవ అక్షరం జపాన్ని సూచిస్తుంది. అనగా పుష్ప జపం అని అర్ధం వచ్చేలా. జపం అనగా ఇష్ట దేవుని ఇతర పేర్లతో స్మరించడం. జ అనే అక్షరం జలాన్ని కూడా సూచిస్తుంది. నిజానికి దేవునికి ఆలోచనలతో సంబంధమే లేకుండా పూలను సమర్పించడం జరుగుతుంది. నిజానికి పెద్ద విషయం కాకపోయినా, మీ ఇష్టదైవానికి సంబంధించి మాత్రం కొన్ని విధి విధానాలు పాటించడం మంచిది. కొన్ని పురాణాల, దేవుని కథలు, వ్రత విధానాల ప్రకారం కొన్ని పూలు పూజకు పనికి రావు అని తెలుపబడినది. అవి ఏమిటో పెద్దలను కనుగొని, తద్వారా పూజకు ఉపక్రమించడం అన్ని విధాలా మంచిదిగా సూచించబడినది.
అయితే మంచి సువాసనలు కలిగిన పూలను దేవునికి సమర్పించడంలో జాగ్రత్తను తీసుకోవాలి. తద్వారా తాజా పూలనే దేవునికి సమర్పించవలసి ఉంటుంది. పెద్దల సూచనల ప్రకారం క్రింద పడిన పూలను సమర్పించడం చేయరాదు. ఎటువంటి కళంకం లేని అందమైన, శుభ్రంగా ఉన్న పూలనే దేవునికి సమర్పించవలసి ఉంటుంది. కొందరు ఒక పళ్ళెంలో నీటిని తీసుకుని అందులో పూలను ఉంచి, సున్నితంగా శుభ్రపరచిన తర్వాతే దేవుని సమర్పించే అలవాట్లు కలిగి ఉంటారు.