Site icon HashtagU Telugu

Bells: ఆలయంలో ఆరు రకాల గంటలు ఎందుకు కొడతారు.. ఎప్పుడు కొడతారో తెలుసా?

Bells

Bells

సాధారణంగా మనం ఆలయంలోకి అడుగు పెట్టిన తర్వాత చేసి మొదటి పని ఆలయంలో ఉన్న గంటను కొట్టడం. గుడి గంటలు కొట్టి ఆ తర్వాత దేవుడి మీద దర్శించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత దేవుడికి హారతి ఇచ్చినప్పుడు నైవేద్యం సమర్పిస్తున్న సమయంలో కూడా గంటను కొడుతూ ఉంటారు. ఈ గంటను కొట్టడం వల్ల ఆధ్యాత్మికం గానే కాకుండా ఆరోగ్యంగా కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అసలు గుడిలో గంటను ఎందుకు కొడతారు అన్న విషయానికి వస్తే.. దేవుని ముందు గంట కొట్టడం వలన ఆ శబ్ధం వినిపించగానే ఆ ప్రాంతంలో ఉన్న దుష్టశక్తులను, చెడు శక్తులు దూరంగా వెళ్లిపోతాయట.

దేవుని ముందు ఏమైనా కోరికలు కోరుకుని గంట కొడితే అది దేవుడి చెంతకు చేరుతుందని భక్తుల నమ్మకం. దేవాలయంలో గంట మోగిస్తే సకల శుభాలకు సంకేతం అని కూడా అంటారు. ఆలయంలో కానీ, ఇళ్లలో కానీ గంట శబ్ధం వల్ల మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. హారతి సమయంలో దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడాని ఈ గంట కొడతారు. కంచుతో తయారు చేసిన గంటను కొట్టినప్పుడు ఓం అనే స్వరం వినిపిస్తుందంటారు. ఈ నాదం వినబడడం వలన మనిషిలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆలయంలో కొట్టే ఆరు రకాల గంటల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అందులో మొదటి గంట ఆలయ ప్రాంగణంలోకి వెళ్లగానే మనకు ధ్వజస్తంభం దగ్గర కనిపిస్తుంది. దీనిని బలి అని పిలుస్తారు. పక్షులకు ఆహారాన్ని పెట్టే సమయంలో ఈ గంటను మోగిస్తారు. రెండవ గంట ఆలయంలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు మోగిస్తారు. మూడవ గంటను దేవుడికి మేలుకొలుపు పాట పాడుతున్న సమయంలో మోగిస్తారు. నాలుగవ గంటను ఈ గంట ఆలయం మూసివేసే సమయంలో మోగిస్తారు. ఐదవ గంటను ఆలయంలో మంటపంలో మోగించే గంట. ఆరవ గంటను స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు మోగిస్తారు. చాలామంది స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు ఎదురుగా ఉన్న గంట కొడుతుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా హారతి సమయంలో మంటపంలో ఉన్న గంటను మ్రోగించకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Exit mobile version