Site icon HashtagU Telugu

Temple Prasadam: గుళ్ళల్లో ప్రసాదం పెడతారు ఎందుకు..?

Prasadam Imresizer

Prasadam Imresizer

మేము తిరుపతి వెళ్లి వచ్చాము అనో, శబరిమలై వెళ్లి వచ్చామనో ప్రసాదం ఇస్తారు. అసలు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు, కేవలం అది భక్తితోనేనా లేక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధ పడుతుంది.

మరే వ్యవస్థలో లేని సోషలిజం మనకు ఈ ప్రసాద వితరణ లో కనపడుతుంది. అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది. ఒక ఊరి లో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం తీసుకునే స్థితిలో ఉండరు. బాగా డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళ గురించి పట్టించుకోరు. వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరూ ముందుకు రారు. అదే దేముడికి ప్రసాదం చేయించండి, మీకు పుణ్యం వస్తుంది అంటే సంతోషంగా ఒప్పుకుంటారు. అలా చేయించిన పౌష్టికాహారాన్ని దేముడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించడం ప్రసాద వితరణ వెనుక ఉన్న అసలు రహస్యం.

మనం తీసుకునే పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, సెనగలు, కట్టె పొంగలి మొదలైన వాటిల్లో ఇనప ధాతువు (ఐరన్), కార్బో హైడ్రేట్లు, కాల్షియం, పీచు పదార్థాలు, సోడియం, పొటాసియం, ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి ప్రసాదం పెట్టడం ద్వారా ఊరి లోని జనాలందరినీ బలంగా, ఆరోగ్యంగా ఉంచాలి అనేది మన పెద్ద వాళ్ళ ఉద్దేశ్యం.