భారతదేశంలో ఎన్నో సంప్రదాయాలు ఆచారాలతో పాటుగా మరెన్నో నమ్మకాలు పద్ధతులు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ముఖ్యంగా కొన్ని పదార్థాలను ఒకరి చేతి నుంచి మరొకరు తీసుకోకూడదని, అలా తీసుకోవడం వల్ల దోషం కలగడం, నష్టం వాటిల్లడం లాంటివి జరుగుతాయి అని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. అందులో కొంతవరకు నిజం ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పదార్థాలు ప్రత్యక్షంగా చేతికి తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయట.
అయితే ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు వాటి గురించి పూర్తిగా తెలిస్తే కొన్ని సత్యాలు కూడా బోధపడతాయి. అయితే మన హిందువులు ఇతరుల నుంచి నూనె, నువ్వులు, కారం,ఉప్పు వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు అని అలా తీసుకోవడం వల్ల దోషం తగులుతుంది అని అంటూ ఉంటారు. అయితే నువ్వులను ఎక్కువగా పితృ కార్యాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వులను అశుభ సందర్భంలో ఉపయోగిస్తామని వాటిని తీసుకోవద్దని అంటూ ఉంటారు.
వాటికి శాస్త్రీయమైన ఆధారాలు ఏమీ లేవు. అయితే అలా ఇతరుల నుంచి తీసుకున్న వస్తువులను మన చేతితో తాకుతూ ఉంటాము. ఆ వస్తువులను తాకిన చేతులు మళ్లీ మన కళ్ళు చర్మానికి రుద్దుకొని ఇబ్బంది పడతాము అన్న ఉద్దేశంతో అటువంటి పదార్థాలను చేతులతో తీసుకోకూడదు అని చెబుతుంటారు. అయితే ఇటువంటి పద్ధతులను నమ్మకాలను కొన్ని ప్రదేశాలలో ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తూ ఉండగా మరికొన్ని ప్రదేశాలలో మాత్రం అవన్నీ మూఢనమ్మకాలు అంటూ కొట్టి పడేస్తూ ఉంటారు.