పురుషులు మొలతాడు ధరిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొందరు ఎర్ర మొలతాడు ధరిస్తే మరికొందరి నల్ల మొలతాడు ఇంకొందరు వెండి మొలతాడు కూడా ధరిస్తూ ఉంటారు. కానీ ఈ మొలతాడును ఎందుకు కట్టుకుంటారు? దానివల్ల కలిగే లాభం ఏంటి అన్న విషయం చాలామందికి తెలియదు. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతి ఒక్క పురుషుడు తప్పకుండా మొలతాడును ధరించాలని పండితులు సైతం చెబుతున్నారు. ఎందుకంటె హిందూ శాస్త్రం ప్రకారం మగవారు మొలతాడు ధరించకపోతే వారి జీవితంలో అదృష్ట దశక తగ్గిపోతుందట. అలాగే వెండి మొలతాడు ధరించడం కూడా చాలా మంచిదని చెబుతున్నారు.
సోమవారం రోజు వెండి మొలతాడును ధరించి శివుడికి పూజ చేయడం వల్ల శుభం కలుగుతుందని అంటున్నారు. ఒకవేళ ఎర్రని మొలతాడును గనుక ధరిస్తే ఆదివారం రోజు మాత్రమే ధరించాలట. ఎందుకంటే సూర్యుడికి ఆదివారం అంటే ఇష్టం, సూర్యుడు ఎర్రగా వుంటాడు కాబట్టి అదే రోజు ఎర్ర మొలతాడును ధరించాలి. దీని వల్ల సూర్యుడి ఆశీస్సులు లభిస్తాయట. నల్లని మొలతాడు గనుక ధరించాలనుకుంటే కేవలం గురువారం రోజు మాత్రమే ధరించాలని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా మగవారికి మొలతాడు లేకుండా ఉండటం అంటే చనిపోవడం అనే అర్థం చెబుతున్నారు. చనిపోయినప్పుడు మాత్రమే మొలతాడు అనేది తీసేస్తారు. దిష్టి తగలకుండా కూడా మొలతాడును కడతారట.
అలాగే పూర్వం రోజుల్లో ఆస్పత్రులు ఉండేవి కావట. వైద్యం కూడా సరిగ్గా అందేది కాదు. అప్పట్లో పాము కరిస్తే మొలతాడు తెంపి పాము కుట్టిన చోట దగ్గర కట్టి విషాన్ని తీసేవారని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే మొలతాడును కట్టుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. జీర్ణ క్రియ కూడా మెరుగ్గా పని చేస్తుంది. హెర్నియా వ్యాధి వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందట. పురుషుల జనేంద్రియాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయనే ఈ మొలతాడును కట్టుకోమంటున్నారు పండితులు.
note: పైన సమాచారం ప్రముఖ జ్యోతిష్యులు, పండితుల నుంచి సేకరించడబడింది.