నిమ్మకాయ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. నిమ్మకాయలను దిష్టి తీయడం కోసం, దేవతలను సమర్పించడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే చాలామంది వ్యాపార ప్రదేశాలలో ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో నిమ్మకాయను ఉంచడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ నిమ్మకాయను ఉపయోగించే ద్రుష్టి దోషాలను తొలగించుకోవచ్చని చెబుతున్నారు. మరి అందుకోసం నిమ్మకాయలతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా వ్యాపార స్థలాలలో బయట మిరపకాయలతో పాటు నిమ్మకాయలను కూడా దిష్టి తగలకుండా వేలాడదీస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నరదృష్టి తగలదని, చెడు కళ్ళు వ్యాపారం పై పడకుండా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. కొన్నిసార్లు పితృ దోషం వల్ల కూడా భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటి నుంచి బయటపడాలి అంటే గురువారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి నాలుగు నిమ్మకాయలు, లవంగాలు తీసుకెళ్ళి పూజ చేయడం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయట.
అలాగే వ్యాపారం బాగా జరగాలి అనుకున్న వారు ఒక నిమ్మకాయను తీసుకుని షాప్ లోని నాలుగు గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి, ఆ తర్వాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కులుగా కట్ చేసి నాలుగు దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచడం ద్వారా శని బయటకు వెళ్తుందట. అలాగే ఇంటి ఆవరణలో నిమ్మ చెట్టు ఉంటే ఎలాంటి ప్రతీక శక్తులు ఇంట్లోకి ప్రవేశించవట. అలాగే ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలున్నా నిమ్మ చెట్టు ఉండటం వల్ల వాస్తు సెట్ అవుతుందట. ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఒక నిమ్మకాయను తీసుకుని కింద నుండి పై వరకూ వారిని చూస్తూ దిష్టి తీసి, దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి, ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి.
వాటిని అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ దిష్టి పోతుందట. నిమ్మకాయను ఒక గాజు గ్లాసులో నీటిలో నిమ్మకాయను ఒక గాజు గ్లాసులో నీటిలో వేసి ఉంచడం వల్ల చెడుని గ్రహించి, మంచిని విడుదల చేస్తుంది. శక్తికేంద్రంగా ఉంటుంది. పరిసరాలను అనుకూలంగా మారుస్తుంది. కేవలం వ్యాపార ప్రదేశాల్లోనే కాదు ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు. కేవలం వ్యాపార ప్రదేశాల్లోనే కాదు ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు. హాలులో ఒక టేబుల్ మీద గాజు గ్లాసులో నీరుపోసి అందులో ఒక నిమ్మకాయను ఉంచడం వల్ల ఎటువంటి ద్రుష్టి దోషాలు ఆ ఇంటి లోపలికి రావట.