Death Rituals: మాములుగా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు గుండు చేయించుకుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా చేయించుకోవడం వెనుక అనేక రకాల కారణాలు ఉన్నాయి. అయితే దీనికి అసలు కారణాలు ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. ఒకవేళ అడిగినా కూడా మా పెద్దలు పాటిస్తున్నారు మేము పాటిస్తున్నాం అని చెబుతూ ఉంటారు. అయితే ఇంట్లో చనిపోయిన తర్వాత కుటుంబంలోని పురుషులు అంత్యక్రియల తర్వాత తలనీలాలు సమర్పిస్తారు.
అయితే ఇది అపవిత్రతను తొలగిస్తుందని, మరణించిన వారితో భౌతిక సంబంధాన్ని తెంచుకోవడానికి పురుష సభ్యులు తలనీలాలు సమర్పిస్తారని నమ్ముతూ ఉంటారు. మరణించిన వారి పట్ల ప్రేమ, గౌరవం చూపించడానికి కూడా తలనీలాలు సమర్పించడం ఒక మార్గం అని చెబుతారు. ఎందుకంటే జుట్టు గర్వం, అహంకారానికి చిహ్నంగా పరిగణిస్తారు. అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తాకుతారు. దీనివల్ల వారు హానికరమైన సూక్ష్మ క్రిములకు గురవుతారు.
కాబట్టి ఈ సూక్ష్మ క్రిములు జుట్టును పట్టి వీడవు. స్నానం అనంతరం కూడా పోవు. అందుకే సూక్ష్మ క్రిముల నుంచి రక్షణ కోసం గుండు చేస్తారు. ఇకపోతే గరుడ పురాణం ప్రకారం చూసుకుంటే.. 13 రోజుల వరకు ఆత్మ ఇంట్లో ఉంటుందట. అందుకే అది కుటుంబంతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుందట. జుట్టును ప్రతికూల శక్తిని గ్రహించే మూలంగా భావిస్తారట. ఆత్మ ఈ సంబంధాన్ని జుట్టు ద్వారా కుటుంబ సభ్యులతో ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తుందట. అందుకే తనయుల జుట్టు కత్తిరించే ఆచారం ఉందని చెబుతున్నారు.
Death Rituals: తల్లి తండ్రులు చనిపోతే కొడుకు గుండు ఎందుకు చేయించుకుంటాడు.. అసలు కారణం అదేనా?

Death Rituals