Site icon HashtagU Telugu

Marriage: స్త్రీలు వారి కంటే పెద్ద వయసు వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోవాలో తెలుసా?

Marriage

Marriage

మామూలుగా పెళ్లి అంటే అటు ఇటు తరాలు ఎటు ఏడు తరాలు చూసి అన్ని విషయాలు ఒకటికి రెండుసార్లు తెలుసుకొని పెళ్లి చేయాలని చెబుతూ ఉంటారు. పెళ్లి అంటే కేవలం ఇద్దరు మనుషుల కలయిక మాత్రమే కాదు రెండు కుటుంబాల కలయిక. పెళ్లి చేసేటప్పుడు చాలా విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని చెబుతూ ఉంటారు. అటువంటి విషయంలో ఏజ్ గ్యాప్ కూడా ఒకటి. పెళ్లి చేసేటప్పుడు వధువు కంటే వరుడు వయసు ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. కొందరు వరుడు వయసు కంటే తక్కువగా ఉంటే అలాంటి పెళ్లి క్యాన్సిల్ కూడా చేసేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో అవేమి పట్టించుకోకుండా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు.

కానీ మన పెద్దల కాలం నుంచి వధువు వయసుతో పోల్చుకుంటే వరుడు వయసు ఎప్పుడు ఎక్కువగా ఉండాలని చెబుతూ ఉంటారు. అలా చెప్పడం వెనుక ఉన్న కారణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.సాధారణంగా స్త్రీలకు సిగ్గుతో కూడిన భయం కొంచెం ఉంటుందని చెప్పాలి. కొందరు బయటపడకపోయినా లోపల స్త్రీలకు తప్పనిసరిగా సిగ్గుతో కూడిన భయం ఉంటుంది. ప్రేమగా చూసుకునే వ్యక్తి కావాలని ప్రతి ఒక్క స్త్రీ కోరుతూ ఉంటారు. అయితే అలాంటి కోరిక నెరవేరాలి అంటే తనను ప్రేమగా చూసుకునే వ్యక్తి రావాలి అంటే తనకన్నా వయసులో ఉన్న పెద్ద వ్యక్తిని భర్తగా పొందాలి.

అంతేకాకుండా స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు. కాబట్టి సంసారాన్ని మోయలేదు. కష్టపడలేదు. ఒకవేళ స్త్రీ పెద్దదైతే కుటుంబం యొక్క బాధ్యత భారం అంతా కూడా ఆ స్త్రీ మీదే పడుతుంది. మగవాడిదే కుటుంబ భారమని చెప్పడానికే అనాదిగా ఈ ఆచారం వస్తోంది. అందువల్లే భార్య కంటే భర్తకు ఎక్కువ వయసు ఉండాలన్నది మన పెద్దలు పెట్టిన నియమం అని చెబుతుంటారు. అలాగే భార్యలు భర్తలను పేరు పెట్టి పిలవకూడదని కూడా అంటూ ఉంటారు. ఇలా పేరు పెట్టి పిలిస్తే భర్త ఆయుష్షు తగ్గుతుందని అంటారు.