Dog: రాత్రిళ్ళు కుక్కలు ఏడవడం వెనుక ఉన్న కారణం ఇదే?

కుక్కలు చాలా విశ్వాసం గల జంతువులు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కుక్కలకు భవిష్యత్తులో జరగబోయే సంఘటలను తెలుస్తాయని వాటి సంకేతాలను మనకు

Published By: HashtagU Telugu Desk
Dog

Dog

కుక్కలు చాలా విశ్వాసం గల జంతువులు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కుక్కలకు భవిష్యత్తులో జరగబోయే సంఘటలను తెలుస్తాయని వాటి సంకేతాలను మనకు ఇవ్వడానికే అవి మెరగడం లేదా ఏడుస్తాయని అంటుంటారు. అటువంటి వాటిలో రాత్రిపూట కుక్కలు ఏడవడం కూడా ఒకటి. చాలామంది బాగా గమనిస్తే.. వీధి కుక్కలు రాత్రి సమయంలో ఎక్కువగా ఏడవడం, గట్టి గట్టిగా అరవడం ఒకే వైపు చూసి మొరగడం లాంటివి చేస్తూ ఉంటాయి. కానీ అవి అలా ఎందుకు అరుస్తున్నాయో తెలియక చాలామంది వాటిపై అరవడం వాటిని కొట్టడం లాంటివి చేస్తూ ఉంటాయి.

మరి ఇంతకీ రాత్రి సమయంలో కుక్కలు ఎందుకు ఏడుస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పగలు కంటే రాత్రిళ్లే కుక్కలు ఎక్కువగా మొరగడం కానీ, ఏడవడం కానీ చేస్తుంటాయి. ముఖ్యంగా అర్థరాత్రిళ్లు కుక్కలు విపరీతంగా ఏడుస్తుంటాయి. కుక్కలు ఏడవడం అశుభమని ఇది చెడుకు సంకేతమని పెద్దలు అంటూ ఉంటారు. కుక్క మీ ఇంటి లోపల రాత్రిళ్లు చాలా సేపు మొరగడం లేదా ఏడిచినా, ఏదో జరగబోతుందని అర్థం. ఇలాంటి సమయంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. కుక్కలకు భవిష్యుత్తులో రాబోయే సంక్షోభం లేదా భయంకరమైన ఘటనల గురించి తెలుస్తాయని ఇప్పటికే చాలా మంది నమ్ముతున్నారు. వీటి గురించి తెలుసుకునే అవి ఏడవడం లేదా మొరగడం వంటివి చేస్తాయని అంటుంటారు.

ఇవి ఆ సంక్షోభాన్ని వ్యక్తీకరించడానికే ఇలా చేస్తాయని అంటారు. మీ ఇంటి లోపల కుక్క ఏడిచినా లేదా మొరిగినా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది వ్యాధిని సూచిస్తుంది. అంటే మీ ఇంట్లో ఎవరో ఒకరు ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నట్టు ఇది సూచిస్తుంది. రాత్రిపూటే కుక్కలు ఎక్కువగా ఏడుస్తుంటాయి. అయితే కుక్క రాత్రిపూట మీ ఇంటి వెలుపల లేదా తలుపు దగ్గర ఏడుస్తున్నట్టైతే దాని చుట్టూ ఒక రకమైన ప్రతికూల శక్తి ఉండవచ్చట. దీని వల్ల కూడా కుక్కలు ఏడుస్తాయని చెబుతారు. చాలా సార్లు ఉన్నట్టుండి పెంపుడు కుక్కలు కూడా ఏడుస్తుంటాయి. అలాగే తినడం కూడా మానేస్తుంటాయి. ఇలాంటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు తెలియని ఎన్నో జరుగుతున్న సంఘటనలను కుక్కలు గ్రహిస్తాయని చెప్తారు. అందుకే కుక్కలు ఏడిస్తే ఇంట్లో ఏదో పెద్ద సంక్షోభం జరగబోతోందని అర్థం.

  Last Updated: 26 Mar 2024, 04:12 PM IST