Site icon HashtagU Telugu

Subramanya Swamy: పిల్లలు లేనివారు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా?

Subramanya Swamy

Subramanya Swamy

ప్రస్తుత రోజుల్లో చాలామంది సంతానం కలగక హాస్పిటల్స్ చుట్టూ దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్నెన్నో పూజలు పరిహారాలు యాగాలు హోమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి పదిమందిలో ముగ్గురు మహిళలు పిల్లలు కలగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే సంతానం కలగని వారు సంతానం కోసం ఎక్కువగా సుబ్రహ్మణ్యస్వామి ఆరాధించడం మనమందరం చూసే ఉంటాం. మరి సంతానం కావాలి అనుకున్న వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఎందుకు పూజిస్తారు. ఈ విషయం గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పార్వతీ పరమేశ్వరులను దర్శించడానికి ఎంతో మంది ఋషులు కైలాసానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో అందులో దిగంబర ఋషులు ఉండడంతో సుబ్రహ్మణ్య స్వామి వారిని చూసి హేళనగా నవ్వాడు. దాంతో పార్వతీదేవి కొడుకుని మందలించి మర్మంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించినవి. జాతికి జన్మస్థానాలని పార్వతీదేవి తన కొడుకుకి తెలియచెప్పింది.

ఇక తల్లి బోధ జ్ఞానతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు. జీవకణాలు పాముల ఉంటాయని మనందరికీ తెలిసిందే.. అలా ఆ తర్వాత వాటికి అధిపతి అయ్యారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కానీ తల్లి జీవకణాల అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వరున్ని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుందని చెబుతారు. ఇకపోతే వారంలో ఆదివారం రోజు సుబ్రహ్మణ్యస్వామికి అంకితం చేయబడింది. ఆదివారం రోజున స్వామి వారిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం ఆరాధించడం వల్ల స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భక్తులు నమ్ముతారు.