Site icon HashtagU Telugu

Karna : మహాభారతంలో కర్ణుడు హీరో ఎందుకు కాలేకపోయాడు?

Karna

Karna : నేటికీ దానగుణంలో కర్ణుడిని ఎగ్జాంపుల్‌గా చెబుతుంటారు. అయినా ఆయన  మహాభారతంలో హీరో కాలేకపోయారు. అంతటి గొప్ప సద్గుణం ఉన్నా కర్ణుడిని అర్జునుడితో సమానంగా పరిగణించలేదు. కారణం ఏమిటి ?  మహాభారతంలోనే ఈ ప్రశ్నకు ఉన్న ఆన్సర్ ఏమిటి? ఇప్పుడు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

మహాభారతంలో ‘దుష్ట చతుష్టయం’ అని పేరొందిన నలుగురిలో కర్ణుడు(Karna) కూడా ఒకడు. కర్ణుడిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. కానీ అహంకారం, అర్జునుడిపై ఈర్ష్య కూడా ఉన్నాయి. ఇవే కర్ణుడికి తర్వాతి కాలంలో శాపాలుగా మారాయి. పాండవులపై కలిగిన అసూయ వల్లే కర్ణుడు.. చెడ్డవాడు అని తెలిసినా దుర్యోధనుడితో చేతులు కలిపాడు. కర్ణుడు, అర్జునుడు ఇద్దరు కూడా ద్రోణుడి శిష్యులే. వాస్తవానికి ద్రోణుడికి తన కుమారుడు అశ్వత్థామ కంటే అర్జునుడు అంటేనే ఎక్కువ ప్రేమ. అశ్వత్థామకు క్షణికావేశం ఎక్కువ. అర్జునుడు చాలా సంయమనంతో ఉంటాడు. అందుకే ద్రోణుడు అర్జునుడికే ఎక్కువ విద్యలు నేర్పించాడు. ఏకలవ్యుడు తన అస్త్ర నైపుణ్యాన్ని మూగజీవాలపై ప్రదర్శించడాన్ని చూసి, ఆయనకు విద్యలు వస్తే ప్రమాదం అని ద్రోణుడు భావించాడని చెబుతారు. ద్రోణుడి నుంచి తనకు ఎలాంటి ఉపయోగం లేదనే భావనతో కర్ణుడు తాను బ్రాహ్మణుడిని అని చెబుతూ పరశురాముడిని ఆశ్రయించాడు.  ఆ తర్వాత బ్రాహ్మణుడి నుంచి, భూదేవి నుంచి కూడా శాపాలు పొందాడు. అవన్నీ కురుక్షేత్ర యుద్ధం టైంలో కర్ణుడిని దెబ్బతీశాయి. యుద్ధభూమిలో రథం కుంగిపోయేలా చేశాయి.

Also Read :Kamala Harris : బైడెన్ బదులు కమల.. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఛాన్స్ ?

యుద్ధానికి  ముందు కృష్ణుడు కర్ణుడిని రథం ఎక్కించుకుని తీసుకెళ్లి.. యుద్ధంలో అధర్మం పక్షాన పోరాడొద్దని చెప్పాడు. అయినా కర్ణుడు వినిపించుకోలేదు. ఇంద్రుడు అడిగాడని తన ప్రాణ రక్షకాలైన కవచకుండలాలు ఇవ్వడం కర్ణుడి దానగుణానికి నిదర్శనమే. కాీ అందుకు ప్రతిఫలంగా శక్తివంతమైన ఆయుధం ప్రసాదించమని అడగడంతో అది ఉత్తమదానం కాలేకపోయింది. కురుక్షేత్ర యుద్ధం టైంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడిని చూసేందుకు కర్ణుడు వెళ్తాడు. ‘‘నాలో వీరత్వం, దానగుణం ఉన్నా నన్నెందుకు తక్కువచేసి చూస్తున్నారు?’’ అని భీష్ముడిని కర్ణుడు అడగగా.. ‘‘ఎన్ని మంచి గుణాలు ఉన్నవారైనా చెడ్డవారి చెంత చేరితే వారి మనసు కూడా ఈర్ష్య, ద్వేషాలతో నిండిపోతుంది. కేవలం దుర్యోధనుడి సాంగత్యం కారణంగానే ప్రజలంతా నిన్ను కూడా లోకువగా చూస్తున్నారు’’ అని బదులిచ్చారు. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో సైన్యాధ్యక్షుడిగా భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులున్నారు. 16వ రోజు కర్ణుడు సైన్యాధ్యక్షుడు అయ్యాడు. అదే రోజు నకుల, సహదేవ, ధర్మరాజులను ఓడించినా..కుంతీదేవికి ఇచ్చిన మాట ప్రకారం చంపకుండా వదిలేశాడు.

Also Read :Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ. 20 వేలు ఆదా.. రూ. 200తో నెలంతా తిరిగొచ్చట!

Exit mobile version