Site icon HashtagU Telugu

Pooja Tips: పూజ సమయంలో ఉల్లి వెల్లుల్లి ఎందుకు తినకూడదో మీకు తెలుసా?

Mixcollage 05 Jul 2024 06 17 Pm 8732

Mixcollage 05 Jul 2024 06 17 Pm 8732

కాగా హిందూ మతం ప్రకారం పూజలు శుభకార్యాలు నిర్వహించేటప్పుడు కొన్ని కొన్ని సార్లు ఉపవాసం పాటించమని చెబుతూ ఉంటారు. ఉపవాసం చేసే సమయంలో తప్పనిసరిగా శాఖాహారం తీసుకోవాల్సిందే. అలాగే మామూలుగానే పూజ చేసేటప్పుడు మాంసాహారం వంటి వాటికీ దూరంగా ఉండాలని చెబుతూ ఉంటారు పండితులు. మాంసాహారం అంటే కేవలం చేపలు మాంసం గుడ్లు మాత్రమే కాకుండా ఉల్లిపాయలు వెల్లుల్లి తినడం కూడా నిషేధించబడింది. ఉల్లి వెల్లుల్లి అనే రెండు పదార్థాలు చాలా ముఖ్యమైనవి. ప్రతిరోజు వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం.

అయితే ఇవి మట్టిలో పెరిగినప్పటికీ శాఖాహారంలో వీటిని నిషేధించబడ్డాయి. పవిత్రమైన శుభ సందర్భంలో పూజలు చేసే సమయంలో ఉపవాసం ఉన్న సమయంలో, యజ్ఞాలకు హాజరైనప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లినీ అసలు తినరాదు. మరి ఉల్లిపాయ వెల్లుల్లి ఎందుకు తినకూడదు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఆహారాన్ని మూడు భాగాలుగా విభజించబడింది. అందులో మొదటిది సాత్వికం రెండవది రాజసం, మూడవది తామసికం. అయితే భారతదేశంలోని వివిధ పురాణాలు లేదా గ్రంధాలు, మీరు తిన్న ఆహారంలో మీ మనస్సు కూడా ఉంటుంది అని ప్రస్తావిస్తుంది. అనగా మీరు తినే ఆహారం మీ జీవితం, మనస్సుపై ప్రభావం చూపుతుంది.

ఆలోచనలన్నీ కూడా ఒకేలా ఉంటాయి. ఆహారంతో పాటు మానసిక స్థితి కూడా మారుతుంది. ఇందులో సాత్విక ఆహారం అంటే ఏంటి అన్న విషయానికి వస్తే.. గరిష్ట సత్వగుణాన్ని కలిగి ఉండే ఆహారాన్ని సాత్విక ఆహారం అని అంటారు. ఇందులో పాలు నెయ్యి పిండి పచ్చి కూరగాయలు పండ్లు మొదలైనవి ఉంటాయి. రాజస ఆహారం అంటే ఏంటి అన్న విషయానికి వస్తే.. చాలా మసాలా దినుసులు కలిగి ఉన్న ఆహారాలు. మాంసాహారం తయారు చేసేటప్పుడు మసాలా దినుసులు ఉపయోగిస్తారు. అందుకే అలాంటి ఆహారాన్ని రాజస ఆహారం అంటారు. వీటిలో కుంకుమ పువ్వు, మిరపకాయలు, మసాలా దినుసులతో పాటు గుడ్లు, మాంసం, చేపలు వంటి మాంసాహార ఆహారాలు కూడా వస్తాయి.

ఇకపోతే తామసిక ఆహారం విషయానికి వస్తే.. మీ రక్త ప్రవాహాన్ని అధికం చేసే ఆహారాన్ని తినడం వలన కొన్నిసార్లు రక్త ప్రవాహం పెరుగుతూ మరి కొన్నిసార్లు తగ్గుతుంది. దీనిని తామసిక ఆహారం అంటారు. అలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల కోపం, గర్వం, టెన్షన్ వంటి భావాలు కలుగుతాయి. వెల్లుల్లి, ఉల్లిపాయలను ఈ వర్గంలో చేర్చారు. ఏ పూజ, ఉపవాసం లేదా మతపరమైన ఆచారాల సమయంలో రెండూ తీసుకోకూడదట.