Site icon HashtagU Telugu

Dead Body: భౌతికకాయాన్ని ఒంటరిగా ఉంచకూడదా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

Fire Accident

Dead Body

భగవద్గీతలో మరణానికి పుట్టుకకు సంబంధించి ఎన్నో విషయాలను తెలిపారు. మరి ముఖ్యంగా చావుకు సంబంధించి అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఆత్మకు మరణం లేదు. మరణంతో కేవలం దేహం నశిస్తుంది. ఆత్మ మరో శరీరధారణ చేస్తుంది. అందుకే హిందూ ధర్మంలో మరణం తర్వాత కర్మకాండలు నిర్వహిస్తారు. మరణించిన వారి కుటుంబ సభ్యులు చాలా నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే మరణం తర్వాత వెంటనే అంత్యక్రియలు జరిపే అవకాశం లేనపుడు ఆ శవాన్ని ఒంటిరిగా వదిలి పెట్టరు. ఒకవేళ భౌతికకాయాన్ని ఒంటరిగా ఉంచితే ఏం జరుగుతుంది? ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారంణంగా మరణం తర్వాత ఒకరోజు లోపు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా శవాన్ని అంతకు మించిన సమయం పాటు ఉండనివ్వరు. శవానికి నిర్వహించాల్సిన అంతిమ సపర్యలను చేస్తారు. స్నానం చేయించడం, మంచి దుస్తులు, పువ్వులతో అలంకరిండం, కడసారిగా తిలకం దిద్దడం వంటివన్నీ చేసి సగౌరవంగా ఊరేగింపుగా అయిన వారంతా కలిసి అంతిమ యాత్రలో పాల్గొంటారు. అంతిమ సంస్కారం తర్వాత చనిపోయిన వ్యక్తి జ్ఞాపకార్థం అందరూ తలరా స్నానం కూడా చేస్తారు. ఆ తర్వాత 10 నుంచి 12 రోజుల పాటు సంతాప దినాలుగా రకరకాల దిన, వార, కర్మలు నిర్వహిస్తారు. వారి జ్ఞాపకార్థం, వారికి సద్గతులు కలగాలనే ఆశయంతో అనేక రకాల దానధర్మాలు కూడా చేస్తారు.

ఇదంతా కూడా దేహాన్ని విడిచిన ఆత్మ సద్గతులు పొందేందుకు చేసే తంతుగా సనాతన ధర్మం చెబుతుంది. దీనిని నమ్మని వారు హిందూవుల్లో దాదాపుగా ఎవరూ ఉండరు. మరణానికి శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. అంతిమ సంస్కారాలలో చాలా నియమాలు ఉంటాయి. నియమాలు పాటించకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని గరుఢ పురాణం చెబుతోంది. అందులో ఒకటి శవాన్ని ఒంటరిగా వదల కూడదు. కచ్చితంగా శవం దగ్గర ఎవరో ఒకరు శవజాగారం చెయ్యాల్సి ఉంటుంది. శాస్త్రాన్ని అనుసరించి సూర్యాస్తమయం తర్వాత అంతిమ సంస్కాలు చెయ్యకూడదు. గరుఢ పురాణాన్ని అనుసరించి శవాన్ని ఒంటరిగా వదిలేస్తే దాని నుంచి దుర్వాసన వస్తుంది. అదే పురాణంలో ఒంటరిగా ఉండే శవంలో ప్రేతాత్మలు వచ్చి చేరే ప్రమాదం ఉంటుంది.

అందుకే అంతిమ సంస్కారాల వరకు శవాన్ని ఒంటరిగా వదిలి పెట్టరు. బంధువులు సందర్శనార్థం కొంత సమయం పాటు శవాన్ని ఉంచినపుడు శవం దగ్గర తప్పకుండా మనుషులు ఎవరో ఒకరు ఉండాలి. అలా ఉండకపోతే గరుఢ పురాణాన్ని అనుసరించి ఆ శరీరంలోకి చెడు ఆత్మలు ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. అది ఆ శరీరానికి, కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదకరం కావచ్చు. కనుక శవం దగ్గర కచ్చితంగా ఎవరైనా ఉండాలి. అదీ కాక బ్యాక్టీరియా చేరి శరీరం కుళ్లిపోవచ్చు. అలా జరగకుండా ఉండేందుకు శవం దగ్గర ధూపం వేసేందుకు కచ్చితంగా ఎవరైనా ఉండడం తప్పనిసరి.

Exit mobile version