Site icon HashtagU Telugu

Sunday: ఆదివారం రోజు మాంసాహారం తినకూడదా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Non Veg

Non Veg

మామూలుగా హిందూమతంలో వారంలో కొన్ని రోజుల్లో కొన్ని రకాల పనులు చేయడం నిషిద్దం. ఎందుకంటే ఈరోజున సూర్య భగవానుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.. ఆయనకు పూజలు చేయడంతో పాటు ఉదయాన్నే నిద్ర లేచి ఆర్ఘ్యం సమర్పిస్తూ ఉంటారు. ఇలా చేస్తే సూర్య అనుగ్రహం కలిగి ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవని శనిపీడలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. మామూలుగా ఆదివారం అంటే సెలవు దినంగా చెబుతూ ఉంటారు. కానీ సూర్యుని దినంగా చెప్పుకుంటే ఆదివారం ఎంతో పవిత్రమైన రోజుగా భావించాలట.

అయితే బ్రిటిష్ పాలనలో భారతీయ సంస్కృతిని మార్పు చేయాలని అనుకున్నారు. బ్రిటీష్ ప్రభుత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి భారతదేశ ప్రజల సాంప్రదాయాలను మార్చకపోతే తమ పాలన కష్టమవుతుందని భావించారు. అందుకే వారు ఆదివారాన్ని అధికారిక సెలవుదినంగా ప్రకటించారు. ఇది భారతీయ సంప్రదాయాలను పూర్తిగా మార్చడానికి ఒక వ్యూహంగా ఉపయోగించారు. బ్రిటిష్ పాలకులు ఆదివారం విశ్రాంతి దినంగా ప్రకటించి పాశ్చాత్య జీవన విధానం భారతీయులకు అలవాటు చేయడం మొదలు పెట్టారు. మాంసాహారం, మద్యం సేవనాన్ని ప్రోత్సహించారు. దీని వల్ల భారతీయులు తమ సంప్రదాయాలను మర్చిపోయి కొత్త జీవన విధానాన్ని అంగీకరించడం ప్రారంభించారు.

ఆదివారం అయ్యింది అంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ తప్పనిసరిగా చేసుకొని తింటూ ఉంటారు. ఆదివారం నాన్ వెజ్ పండుగ అని కూడా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారాన్ని పవిత్రంగా పూజించడం వల్ల శరీర శుద్ధి మానసిక ప్రశాంతత లభిస్తాయట. మాంసాహారం తినడం వల్ల శరీరంలో అధిక వేడి పెరుగుతుందని ఇది ఆరోగ్యపరంగా మంచిది కాదట. సూర్యుడు శరీరానికి ప్రతిరోజూ శక్తినిచ్చే శక్తి స్థానం. కాబట్టి ఆ రోజున శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచి సౌమ్యమైన ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం. అలాగే ఆ రోజు మాంసాహారం తినడం వల్ల సూర్యుని శక్తిని కలుషితం చేయడమే అని అర్ధం. ఆదివారం రోజు పూజలు, ధ్యానం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరం, మనసు స్వచ్ఛంగా ఉంటాయట. ఈ రోజున కఠినమైన ఆహారం తీసుకోవడం మాంసాహారం తినడం అనేక ప్రతికూల ఫలితాలను కలిగించవచ్చట. అందువల్ల హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం మాంసాహారం తినకుండా ఆ రోజున సూర్య భగవానునికి పూజలు చేసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు..ఇది మన ఆరోగ్యానికి మంచిదే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో మేలు చేస్తుందట.