Astrology : హనుమాన్ పూజకు శని, మంగళవారాలే ఎందుకు అనుకూలం..?

  • Written By:
  • Publish Date - November 22, 2022 / 05:37 AM IST

వారంలో ఒక్కరోజు ఒక్కోదేవుడు పూజలందుకుంటాడు. సూర్యుడు, శివుడు,శని ఇలా వారంలో ఒక్కోరోజు దేవుడిని పూజిస్తే శాంతి పొందుతారు. ప్రతిరోజూ కూడా దేవుడిని ప్రార్థించడం హిందువులు ప్రత్యేకత. అయితే మంగళవారం, శనివారం మాత్రమే ఆంజనేసయస్వామిని పూజించేందుకు అనుకూలమైన రోజులు. సాధారణంగా అందరూ ఈ రెండు రోజుల్లోనే హనుమాన్ ను పూజించేందుకు ఇష్టపడతారు. మంగళ, శనివారాల్లో హనుమాన్ పూజ ఎందుకు అనుకూలమో తెలుసుకుందాం.

శుభ దినం
హనుమాన్ చాలా మంది భక్తులకు ఆరాధ్యుడు. ఆంజనేయస్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. హనుమంతుని నామ స్మరణతో అన్ని దుఃఖాలు, బాధలు తొలగిపోయి మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. హనుమంతుడు బలం, ధైర్యం, ఆనందం, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతుంటారు. మంగళవారం, శనివారాలు ఆంజనేయుడిని పూజించడానికి చాలా పవిత్రమైన రోజులు. ఇలా మంగళ, శనివారాల్లో చాలా మంది ఆంజనేయుడిని దర్శించుకుని పూజలు చేస్తారు. ఆంజనేయ పూజకు మంగళవారం ఎందుకు అనువైన రోజు అనేదాని గురించి తెలుసుకుందాం.

మంగళవారమే ఎందుకు మంచి రోజు…?
హనుమంతుడిని ఆ పరమేశ్వరుని అవతారమని భక్తులు నమ్ముతుంటారు. హనుమాన్ కేసరి, అంజన దంపతుల కుమారుడు. చైత్రమాసం మొదటి రోజున జన్మించాడు. ఆంజనేయ జన్మదినం మంగళవారం. ఆ విధంగా భక్తులు మంగళవారం ఆంజనేయ స్వామికి పూజ జరుపుకుంటారు . మంగళవారం నాడు పవన్ పుత్రుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు. శ్రీరాముని పట్ల విధేయత, భక్తికి పేరుగాంచిన మారుతి, బలం జ్ఞానానికి కూడా ప్రసిద్ది.

శనివారం ఎందుకు పూజిస్తారు
వారంలో ఏ రోజు అయినా హనుమంతుడిని భక్తితో పూజించవచ్చు. అయితే మంగళవారం ఆంజనేయుడిని పూజించడానికి మరింత పవిత్రమైనదిగా భావిస్తారు. చాలా మంది ప్రజలు శనివారం, మంగళవారం కూడా ఆంజనేయ దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆంజనేయ స్వామిని పూజించడానికి శనివారం కూడా అనువైన రోజు. సాధారణంగా శనివారం నాడు అందరూ శని దేవుడిని పూజిస్తారు. అయితే శనివారం నాడు హనుమంతుడిని పూజించడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని భక్తుల నమ్మకం. హనుమాన్ ను పూజించడం వల్ల శనిదేవునికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతుంటారు.

మనశ్శాంతి
శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడిని చిరంజీవి అంటారు. ఆంజనేయుడిని పూజించడం వల్ల విజయం, శాంతి, ఆనందం, బలం, ధైర్యం లభిస్తాయి. ఆంజనేయుడిని పూజించే రోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత హనుమాన్ చాలీసా జపించాలి. ఎర్రని పువ్వులు సమర్పించి, దీపం వెలిగించి పూజ చేయాలి. ఆంజనేయుడికి ఇష్టమైన రంగు ఎరుపు. ఈ రోజున ఎరుపు రంగు పదార్థం, వస్త్రాలను దానం చేయడం వల్ల కోరిక కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

ఉపవాసం
చాలా మంది మంగళవారం ఉపవాసం ఉంటారు. అంతేకాకుండా దీపం వెలిగించి నైవేద్యాన్ని సమర్పిస్తారు. పూజ సమయంలో అరటిపండుతో సహా పలు రకాల పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. కుంకుమపువ్వు, ఎరుపు రంగు వస్త్రం, ఎరుపు రంగు పూలు, నైవేద్యానికి బెల్లం లేదా మోతీచూర్ లడ్డును హనుమాన్ కు సమర్పిస్తారు. హనుమాన్ చాలీసా పఠనంతో పాటు శ్రీరామ రక్షా స్త్రోత్రాన్ని కూడా పఠిస్తారు.