Site icon HashtagU Telugu

Flowers: పూజలో పువ్వులను ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా?

Mixcollage 02 Feb 2024 10 14 Am 704

Mixcollage 02 Feb 2024 10 14 Am 704

మామూలుగా దేవుడికి పూజ చేసేటప్పుడు పూలను ఉపయోగించడం అన్నది తప్పనిసరి. పువ్వులు లేకుండా దేవుడికి పూజ చేసినా కూడా పూజ చేసినట్టుగా ఉండదు. ఇంకా చెప్పాలంటే కొందరికి పూజ చేసేటప్పుడు పూజకు పువ్వులు లేకపోతే కనీసం పూజ చేయాలని కూడా అనిపించదు. కేవలం పువ్వులను పూజ కోసం మాత్రమే కాకుండా పండుగలు పెళ్లిళ్లు ఇలా ఏదైనా సందర్భాలలో ఇళ్ళను పూలతో అందంగా అలంకరిస్తూ ఉంటాం. వివాహాది శుభకార్యాలు అయినా, సందర్భం ఏదైనా సరే పూలకు ఉండే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మన పరిసరాలను, పర్యావరణాన్ని సానుకూల శక్తితో నింపడం పువ్వులతోనే సాధ్యమవుతుంది.

అందుకే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా, వారు త్వరగా కోలుకోవాలని పువ్వుల బొకేలు ఇస్తూ ఉంటారు. మనసుకు ఆహ్లాదం కలగటానికి ఇంట్లో పూలతో అలంకరణ చేస్తూ ఉంటారు. మతపరమైన సందర్భాలలో కూడా వివిధ రకాల పుష్పాలను ఉపయోగిస్తారు. పూజలలో పువ్వులకు ఉండే స్థానం అంతా ఇంకా కాదు. మనుషుల యొక్క భావోద్వేగ స్థితిని కూడా పూలు స్పష్టం చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వివిధ రకాల పువ్వులు, వివిధ రంగుల పువ్వులు, సువాసనలు సృష్టించే పువ్వులు అనేకం మనం పూజ కోసం ఉపయోగిస్తూ ఉంటాం.

పూజకు ఉపయోగించే ఒక్కో పువ్వుకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. పూజలలో ఉపయోగించే బంతి పువ్వు బృహస్పతి తో సంబంధం కలిగి ఉంటుంది. బంతి పువ్వు విద్యను, జ్ఞానాన్ని సూచిస్తుంది. సరస్వతీదేవి పూజలో బంతి పువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు. పువ్వులలో గులాబీ పువ్వులు శుక్ర గ్రహం తో సంబంధం కలిగి ఉంటాయి. గులాబీ పువ్వులను లక్ష్మీదేవి పూజలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే పారిజాత పుష్పాలను విష్ణుమూర్తికి సమర్పిస్తారు విష్ణుమూర్తికి పారిజాత పూదండ ని సమర్పించడం వల్ల సంతాన సంబంధమైన సమస్యలు తీరుతాయని చెబుతారు. ఇలా ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉండడంవల్ల, అవి ప్రకృతి సృష్టి కావడం వల్ల, పవిత్రమైనవిగా మనం భావించడం వల్ల వాటిని పూజలలో ఎక్కువగా ఉపయోగిస్తాము. అలాగే దేవుడికి పూజ చేసేటప్పుడు పువ్వులు లేకుండా పూజ చేయడంని అసంపూర్ణంగా భావిస్తారు.