Black Cat : నల్ల పిల్లి గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది ?

Black Cat : పిల్లులు ప్రతికూల శక్తికి మూలం అని వాస్తు శాస్త్రం చెబుతోంది. 

  • Written By:
  • Updated On - February 17, 2024 / 11:55 AM IST

Black Cat : పిల్లులు ప్రతికూల శక్తికి మూలం అని వాస్తు శాస్త్రం చెబుతోంది.  నారద పురాణం ప్రకారం.. నల్ల పిల్లి తరచుగా ఇంట్లోకి రావడాన్ని అశుభంగా భావిస్తారు. నల్ల పిల్లులను దుష్ట శక్తుల రాకకు చిహ్నంగా పరిగణిస్తుంటారు.  వెళ్తున్న దారిలో నల్ల పిల్లి అడ్డొస్తే అశుభమని చాలామంది నమ్ముతుంటారు. అందుకే ఎవరైనా బయలుదేరే ముందు పిల్లి ఎదురుపడితే వెంటనే ఆగిపోతారు. కాసేపు కూర్చొని మళ్లీ లేచి బయలుదేరుతారు. ఇదంతా మన దేశంలో మాత్రమే జరుగుతుంటుంది. విదేశాల్లో మాత్రం పిల్లులను ఇళ్లలో ప్రేమగా పెంచుకుంటారు. మనదేశంలోనూ ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ పెరుగుతోంది. నల్ల పిల్లి గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • నల్ల పిల్లిని(Black Cat) చాలామంది ఇళ్లలోకి ఎంటర్ కానివ్వరు. దాన్ని పేదరికానికి సంకేతంగా భావించి అలా చేస్తుంటారు.
  • నల్ల పిల్లి ఇంట్లోకి వచ్చి వంటగదిలో పాలు తాగడం మంచిది కాదని నమ్ముతారు. అలా జరిగితే ఆర్థికంగా నష్టం సంభవిస్తుందని జ్యోతిష్యులు చెబుతుంటారు.
  • ఇంట్లోకి నల్ల పిల్లి పదేపదే ప్రవేశించడాన్ని కూడా నెగెటివ్‌గా పరిగణిస్తారు.  దీన్ని త్వరలో జరగబోయే పెద్ద నష్టానికి  సంకేతమని చెబుతారు.
  • నల్ల పిల్లి మిమ్మల్ని తాకడం లేదా మీపై దాడి చేస్తే.. అది మీ జీవితంలోని సంక్షోభాన్ని సూచిస్తుంది.
  • ఇంట్లో నల్ల పిల్లి ఉండటాన్ని కూడా దెయ్యాలకు సంకేతంగా భావిస్తారు.  పిల్లులతో కలిసి ఇంట్లోకి దుష్ట శక్తులు కూడా వస్తాయని నమ్ముతారు.

పిల్లి శుభమా? అశుభమా?

పురాతన విశ్వాసాల ప్రకారం.. పిల్లులు ఇంటికి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి. ఇంట్లో పెంచుకోవడం శ్రేయస్కరం కాదు. పిల్లి ఎడమ నుంచి కుడి వైపునకు కదిలితే అశుభం. కుడి నుంచి ఎడమ వైపునకు కదిలితే శుభసూచికం. ఇలా ఉన్నో భ్రమలు ప్రజల్లోఉన్నాయి. ఇక పిల్లి ఏడుపు కూడా అశుభంగా పేర్కొంటారు. ఇలాంటి అనేక అపోహలు ప్రజల్లో వ్యాప్తి చెందాయి.

అసలు కథ ఇదీ..

పూర్వకాలంలో ప్రజలు అడవి గుండా వెళ్లేవారు. రహదారులు సరిగా లేని సమయంలో నడచుకుంటూ వెళ్లేవారు. చీకట్లో సైతం ప్రయాణాలు సాగించేవారు. ఆ సమయంలో వారి దారికి పిల్లి ఎదురొస్తే వెనుక ఏదో అడవి జంతువు ఉంటుందని పసిగట్టేవారు. దాంతో వారు జాగ్రత్తపడి తమ తమ స్థానాల్లోనే నిలిచిపోయేవారు. భద్రత కలిగిన ప్రదేశాల్లో తలదాచుకునేవారు. రాత్రి వేళ పిల్లులు వేటాడుతుంటాయి. రాత్రిళ్లు వాటి కళ్లు భయంకరంగా ఉంటాయి. గుర్రాలు, ఎద్దులపై ప్రయాణం చేసే బాటసారులు రాత్రిపూట పిల్లి కళ్లను చూసి భయపడేవారు. ఆ సమయంలో ప్రజలు తమ జంతువులను శాంతింపజేయడానికి కాసేపు ఆగిపోయేవారు. ఇది క్రమంగా మూఢవిశ్వాసంగా పరిణమించింది.

Also Read : AP Jobs : వైజాగ్‌లో 130 జాబ్స్.. కడపలో 24 జాబ్స్.. అప్లై చేసుకోండి

గమనిక : ఈ సమాచారం వివిధ మాధ్యమాల నుంచి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. దీని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.