Site icon HashtagU Telugu

Diwali 2024: దివాలీ రోజు కేవలం 13 దీపాలను మాత్రమే ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

Diwali

Diwali

దీపావళి పండుగ వచ్చింది అంటే చాలు చాలామందికి ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఎన్ని దీపాలను వెలిగించాలి? ఆ దీపాలను ఎక్కడెక్కడ పెట్టాలి? అలాగే 13 దీపాలను మాత్రమే వెలిగించాలి అని చెప్పడం వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. మరి దీపావళి పండుగ రోజు కేవలం 13 దీపాలను మాత్రమే ఎందుకు వెలిగిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

13 మూడు దీపాల్లో మనం ముందుగా వెలిగించే మొదటి దీపం మనల్ని, మన కుటుంబాన్ని అకాల మరణం నుంచి కాపాడుతుందట. 13 దీపాలను ధనత్రయోదశి నాడు దక్షిణ దిశలో వెలిగించాలి. అది కూడా ఇంటి బయట వెలిగించాలి అని చెబుతున్నారు. ఇక రెండవ దీపం శుభాలు కలగడానికి వెలిగిస్తారు. దీపావళి రోజు రాత్రి నెయ్యితో దీపాన్ని వెలిగించాలని చెబుతున్నారు. మూడో దీపం లక్ష్మీదేవి ముందు వెలిగించి సంపద, శ్రేయస్సు, విజయాలు కలగాలని అమ్మవారిని వేడుకోవాలి. ఇలా చేస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని చెబుతున్నారు పండితులు. నాలుగవ దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించాలని, ఇలా చేస్తే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది అని చెబుతున్నారు పండితులు.

ఐదవ దీపాన్ని మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు పెట్టాలట. ఇలా చేస్తే ఆ దీపం మీ ఇంటికి ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుందని అలాగే ఇంట్లో సంతోష వాతావరణాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. ఆరవ ద్వీపం రావి చెట్టు కింద పెట్టాలట. ఈ దీపాన్ని ఆవ నూనెతో వినియోగించాలని చెబుతున్నారు. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. ఏడవ దీపాన్ని ఆలయంలో వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఎనిమిదో దీపాన్ని డస్ట్ బిన్ దగ్గర వెలిగించడం వల్ల అదిమీ ప్రతికూల శక్తులను, దుష్ట శక్తులను తిరిమికొడుతుందనే నమ్మకం. 9వ ద్వీపాన్ని వెలిగించడం వల్ల మన జీవితంలో సానుకూర శక్తులు తీసుకురావడానికి అది ఎంతో బాగా ఉపయోగపడుతుందట. ఇక ఈ దీపం ప్రతికూల శక్తి నుంచి మనకు రక్షణగా నిలుస్తుందట. ఈ పదవ దీపాన్ని ఇంటి పైకప్పుపై వెలిగించడం మంచిదని చెబుతున్నారు. పదకొండవ దీపం…ఈ దీపం దుష్ట శక్తులతో పోరాడేందుకు సహాయపడుతుందట. దీన్ని ఇంట్లో కిటికీ దగ్గర పెట్టడం మంచిదని చెబుతున్నారు. ఇక పన్నెండవ దీపం.. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. దీన్ని ఇంటి పై అంతస్తులో పెట్టడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు అని చెబుతున్నారు.