Site icon HashtagU Telugu

Lord Hanuman and Sinduram: హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసా?

Hanuman Sindhuram

Hanuman Sindhuram

భారతదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం ఉండని గ్రామం ఉండదు ఆనందంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే మామూలుగా మనం ఏదైనా గుడికి వెళితే అక్కడ పసుపు లేదా కుంకుమ దేవుళ్లకు పెడుతూ ఉంటారు. కానీ ఆంజనేయ స్వామికి మాత్రం సింధూరం పెడుతూ ఉంటాను. మరి ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టం అన్న విషయానికి వస్తే.. ఒకసారి సీతమ్మ తల్లి ఆంజనేయుడు చూసి వెంటనే సీతమ్మని అడుగుతూ ఎందుకమ్మా సింధూరాన్ని ధరిస్తున్నావు అని అని అడగగా వెంటనే సీతమ్మ తల్లి ఏం చెప్పాలో తోచక వెంటనే రామచంద్రుడికి మేలు కలుగుతుంది అని చెప్పిందట.

ఇక సీతమ్మ చెప్పిన దాంట్లో శ్రీరామచంద్రుడికి మేలు తిరుగుతుంది అన్న పదం హనుమంతునికి బాగా నచ్చడంతో మొదటి రోజు తన శరీరం మొత్తం సింధూరం పూసుకొని సభకు వెళ్లాడట. అప్పుడు అక్కడ వారు ఎందుకు ఇలా కొంచెం ఎండా సింధూరం పూసుకున్నావు అడగగా సీతమ్మ తల్లి చెప్పే సమాధానం చెప్పారట ఆంజనేయులు. ఆంజనేయ స్వామికి భక్తికి పరవశుడే ఒక వరం ఇస్తూ నిన్ను ఎవరైతే సింధూరంతో పూజిస్తారో వారిని కష్టాల నుండి నేను కాపాడుతాను అని శ్రీరామచంద్రుడు ఆంజనేయుడికి మాట ఇస్తాడు.

ఇక అప్పటినుంచి ప్రతి మంగళవారం సింధూరాన్ని ఆంజనేయ స్వామి ఒంటికి పూసి ఆ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించిన తర్వాత నువ్వుల నూనె సింధూరం కలిపిన మిశ్రమాన్ని పూజిస్తూ ఉంటారు. సింధూర పూజ అంటే హనుమంతునికి ఎంతో ఇష్టమైనది. అందులోనూ మంగళవారం రోజు సింధూరం పూజ అంటే మరీ మరీ ఇష్టపడుతూ ఉంటారు ఆంజనేయస్వామి.

Exit mobile version