Shani Dev: శని దేవుని భార్యలు ఎవరు.. వారికి పూజలు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది?

నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం గురించి మనందరికీ తెలిసిందే. శని గ్రహాన్ని శని దేవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు.

Published By: HashtagU Telugu Desk
Shani Dev

Shani Dev

నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం గురించి మనందరికీ తెలిసిందే. శని గ్రహాన్ని శని దేవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా శని గ్రహాన్ని నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహం అని కూడా పిలుస్తూ ఉంటారు. శని దేవుని న్యాయ దేవుడు, కర్మదాత అని కూడా పిలుస్తూ ఉంటారు. కాగా చాలామంది శని దేవుని పేరు విన్న శని దేవుని ఆలయాలకు వెళ్ళాలీ అన్న భయపడిపోతూ ఉంటారు. మరికొందరు శని దేవున్నీ భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే శనిదేవుని చూసి భయపడే వారి సంఖ్య ఎంత ఉందో శని దేవున్ని పూజించే వారి సంఖ్య కూడా అంతే ఉంది.

అయితే శని దేవునితో పాటు శని దేవుని భార్యలను కూడా పూజించడం వల్ల కొన్ని రకాల ఫలితాలు కలుగుతాయి. శని దేవుని భార్యలు ఎవరు వారు ఎంతమంది వారిని ఏ విధంగా పూజించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం..శని దేవుడు తనకి పూజలు చేయడంతో పాటు తన భార్యలను ఆరాధిస్తే సంతోషపడడంతోపాటు అటువంటి వారికి అనుగ్రహం కూడా లభిస్తుందట. శని దేవుని భార్యల విషయానికి వస్తే..

శని దేవునికి వరుసగా, ద్వాజిని, ధామిని, కంకాలి, కలహప్రియ, కంటకి, తురంగి, మహిషి, అజా ఇలా ఎనిమిది మంది భార్యలు ఉన్నారు. అయితే శని దేవుని పూజించే ముందుగా అతని భార్యల పేర్లను కూడా శాంతింపచేయవలసి ఉంటుంది. అలాగే శనివారం రోజున వారి పేర్లమీద పూజలు చేయడం చాలా మంచిది. శని దేవుని భార్యలను పూజించడం నావల్ల శని దేవుడు సంతోష పడడంతో పాటు వారిని పూజించడం వల్ల కొన్ని మంచి ఫలితాలు కూడా లభిస్తాయి.

  Last Updated: 01 Nov 2022, 08:57 PM IST