Astro Tips: రోడ్డు మీద నడుస్తున్నప్పుడు..పొరపాటున కూడా వీటిపై దాటకండి..!!

రోడ్డుపై నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు నడుస్తాను అంటే కుదరదు. ఎందుకంటే ఎన్నో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

  • Written By:
  • Publish Date - October 17, 2022 / 06:22 PM IST

రోడ్డుపై నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు నడుస్తాను అంటే కుదరదు. ఎందుకంటే ఎన్నో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాంటి సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం వాహనాల విషయంలోనే కాదు…మనం నడుస్తున్న దారిలో ఏవైన వింత వస్తువులు కనిపించినట్లయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. వాటిపై అస్సలు దాటకూడదు. ఎలాంటి వస్తువల పట్ల జాగ్రత్తగా ఉండాలో చూద్దాం.

నిమ్మకాయ,పచ్చి మిరపకాయ:
దుకాణాలు, ఇళ్ల పై నుంచి చెడుద్రుష్టి నుంచి రక్షించుకునేందుకు చాలా మంది నిమ్మకాయ, పచ్చిమిరపకాయలను వేలాడదీస్తారు. ఇవి తమలోని అన్ని దుష్టశక్తులను గ్రహిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఇళ్లకు, దుకాణాలకు కట్టిన వాటిని తీసి రోడ్లపై విసిరేస్తారు. దానిపై అడుగుపెట్టడం అశుభం. కాబట్టి మనం నడిచే దారిని జాగ్రత్తగా చూస్తూ నడవటం అలావాటు చేసుకోవాలి.

ఇలాంటి వస్తువులను ఎప్పుడూ ముట్టుకోవద్దు:
శ్రాద్ధ సమయంలో బయటి ఆహారాన్ని తినడం నిషేధం. ఈ సమయంలో జరిగే మాయలకు దూరంగా ఉండటమే కారణం. శ్రద్ధ రోజుల్లో పూరీ, ఖీర్ లాంటి ఎన్నో వస్తువులను రోడ్డుపై ఉంచుతారు. ఈ వస్తువులపై మర్చిపోయి కూడా అడుగు పెట్టకూడదు.

కూడలిలో జాగ్రత్తలు:
అడ్డదారిలో ఏ వస్తువు పెట్టినా వాటిపై కాలు పెట్టకూడదు. నజర్ సమస్యలు రాకుండా అడ్డదారుల్లో వస్తువులను పడేస్తుంటారు. అలాంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి.

జుట్టు:
వెంట్రుకల గుత్తిరోడ్డపై ఉంటే అది అశుభం. మీరు రోడ్డు మీద పడి ఉన్న జుట్టుపై కాలు పెట్టకూడదు.

మీకు ఏదైనా వింతగా కనిపిస్తే:
మీకు రోడ్డుపై ఏదైనా వింతగా కనిపిస్తే. ఉదాహరణకు , మేకప్ వస్తువులు , బట్టలు మొదలైనవి వాటికి దూరంగా నడవండి.