Tulasi puja: తులసి మొక్కకు నీళ్లు సమర్పించేటప్పుడు..ఈ మంత్రాన్ని పఠించండి..లక్ష్మీ కటాక్షిస్తుందట..!!

  • Written By:
  • Publish Date - November 23, 2022 / 06:25 AM IST

హిందూవుల ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది. ప్రతిరోజూ స్నానం చేయగానే తులసినీరు సమర్పిస్తుంటారు. అనంతరం సూర్య నమస్కారాలు చేసుకుంటారు. అయితే తులసికి నీటిని సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల లక్షీదేవి కటాక్షిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. తులసి మొక్క సానుకూల శక్తిని ప్రసారం చేయడంతో…ఆ ఇంట్లో నిత్యం ఆనందం నెలకొంటుంది.

అయితే తులసి పూజకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. తులసి మొక్కను ఇంట్లో సరైన దిశలో ఉంచి…నియమ నిబంధనల ప్రకారం పూజించినట్లయితే…మంచి ఫలితాలు వస్తాయి. తులసి పూజకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ గ్రంథాల ప్రకారం తులసిని తప్పకుండా పూజించాలి. ఇలా పూజిస్తే..లక్ష్మీదేవితోపాటు విష్ణుమూర్తి ఆశీర్వాదాలు లభిస్తాయి. అయితే స్నానం చేసిన తర్వాత మాత్రమే తులసిని పూజించాలన్న విషయం గుర్తుంచుకోవాలి. తులసికి ఎక్కువ మొత్తంలో నీటిని సమర్పించకూడదు. ఆదివారం తులసిని ముట్టుకోకూడదు. ఆరోజు లక్ష్మీదేవి తులసి ముట్టుకుంటే ఆగ్రహిస్తుంది. ఏకాదశినాడు తులసికి నీరు సమర్పించకూడదు.

తులసి పూజ సమయంలో నీరు సమర్పించేటప్పుడు తులసి మంత్రాన్ని పఠించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. సుఖసంతోషాలు, సౌభాగ్యం, శాంతి నెలకొని ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అంతేకాదు శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. తులసికి నీరు సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని జపించండి.

మంత్రం- మహాప్రసాద్ జనని, సర్వ

సౌభాగ్యవర్ధిని ఆది వ్యాధి హర నిత్యం, తులసీ త్వం నమోస్తుతే…