Vinayaka Chaviti : వినాయక చవితి వేళ ఇంట్లో పూజ చేసేందుకు ఎలాంటి గణపయ్య ప్రతిమను కొనాలి ? గణపయ్య ప్రతిమను కొనే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? మన మనసులోని కోరికకు అనుగుణంగా ప్రతిమను ఎంపిక చేసుకోవాలా ? ఎటువంటి మనోభీష్టానికి ఎలాంటి గణేశుడి ప్రతిమ తీసుకోవాలి ? ఈ ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం..
ఎడమ వైపు తొండంతో వినాయకుడు
మన ఇంట్లో ఉండే వాస్తుదోషాలు పోవాలంటే ఎడమ వైపు తొండం ఉన్న గణపయ్య ప్రతిమను తీసుకొచ్చి పూజించాలి. దీనివల్ల మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. అన్నింటా విజయం వరిస్తుంది.
కుడివైపు తొండంలో గణేశుడు
మన కోరికలు తప్పకుండా నెరవేరాలని భావిస్తే కుడివైపు తొండంతో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి పూజలు చేయాలి. మనోభీష్టాలను నెరవేర్చడంలో ఈ గణపయ్య పవర్ ఫుల్.
Also read : Kim Jong Un – Putin : ఉత్తరకొరియాకు రష్యా ఆ టెక్నాలజీని ఇవ్వబోతోందట !
మధ్యలో తొండంతో గణపయ్య
మనకు తెలియకుండానే ఇళ్లలోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంటుంది. అలాంటి నెగెటివ్ ఎనర్జీని ఇంటి నుంచి తరిమికొట్టే శక్తి మధ్యలో తొండం ఉండే వినాయకుడికి ఉంది. అలాంటి ప్రతిమకు పూజలు చేసి మనం మన ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో నింపుకోవచ్చు. రావి ఆకు రూపంలో ఉన్న వినాయకుడి ప్రతిమ కూడా ఇవే ఫలితాలు ఇస్తుంది.
తెలుపు రంగు
ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే తెలుపు రంగులో ఉండే వినాయకుడిని పూజించాలి. ఇంట్లో దంపతులు లేదా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉంటే ఈ గణపతి విగ్రహాలను పూజిస్తే మంచిది. ఫలితంగా కలహాలు తొలగిపోయి సఖ్యతగా ఉంటారు. ఇక ఫేమస్ కావాలంటే వెండి గణేషుడిని, ఆరోగ్యం కావాలంటే చెక్క రూపంలో ఉన్న గణేషున్ని, సంతోషం కావాలంటే ఇత్తడి వినాయకుడిని, కెరీర్ లో సక్సెస్ కావాలంటే మట్టి గణపయ్యను పూజించాలి. ఇంట్లో మనం సాధారణంగా పూజ కోసం బొటనవేలికి మించకుండా వినాయక విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి. వినాయక చవితి లాంటి పూజలు చేసేటప్పుడు మాత్రం అరచేతిని మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి. ఎంతపెద్ద విగ్రహం ఉంటే.. ఆ విగ్రహం పరిమాణం స్థాయిలో ధూపదీప నైవేద్యాలు జరగాలి.
గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.