Site icon HashtagU Telugu

Puja Vidhi: కోరిన కోరికలు నెరవేరాలా.. మరి ఏ దేవుడిని ఏరోజు పూజించాలి తెలుసా?

Puja Vidhi

Puja Vidhi

భారతదేశంలో హిందువులు ఒక్కోరోజు ఒక్కో దేవుడిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. కానీ చాలామందికి ఏ రోజున ఏ దేవుడిని పూజించాలి. ఏ దేవుడికి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అన్న విషయంలో గందరగోళం నెలకొంది. మరి ఏ రోజున ఏ దేవుడికి పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సోమవారం శివునికి అంకితం చేయబడింది. సోమవారం రోజు ఉపవాసం ఉండి శివునికి బిల్వ పుత్రం,చందనం, తెల్లటి పూలు సమర్పించి పూజ చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. మంగళవారం హనుమంతునికి అంకితం చేయబడింది. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠించి ఎరుపు,నారింజ రంగు పువ్వులతో పూజించి దీపం వెలిగించడం వల్ల హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది.

బుధవారం విఘ్నేశ్వరుడికి అంకితం చేయబడింది కాబట్టి ఆ రోజున గరిక, పసుపు,తెల్ల పూలు, అరటిపండు,మోదకం వంటివి సమర్పించి పూజ చేయడం వల్ల గణేష్ అనుగ్రహం లభిస్తుంది. అలాగే గురువారం బృహస్పతికి సాయిబాబాకి విష్ణువుకి అంకితం చేయబడింది. గురువారం రోజున విష్ణువును పూజించడం వల్ల సమస్యలు ఉన్న తొలగిపోతాయి. విష్ణువుకి నెయ్యి పాలు,పసుపు,బెల్లం సమర్పించాలి. అలాగే సాయిబాబాకు పాలకోవా వంటివి పెట్టి పూజించడం వల్ల బాబా అనుగ్రహం లభిస్తుంది.

శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈరోజున లక్ష్మికి, బెల్లం, శనగలు, నెయ్యి పాల ఉత్పత్తులను నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఐశ్వర్యం సంపద లభిస్తుంది. శనివారం రోజున శనీశ్వరుడికి అలాగే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఈ రోజు శనీశ్వరుని ఆలయానికి వెళ్లి నువ్వుల దీపం వెలిగించి నువ్వులు,నువ్వుల నూనె నైవేద్యంగా పెట్టడం వల్ల శని దోషం తొలగిపోతుంది.

Exit mobile version