Site icon HashtagU Telugu

Fruits: దేవుడికి ఏ పండ్లను నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో మీకు తెలుసా?

Mixcollage 10 Feb 2024 12 46 Pm 4043

Mixcollage 10 Feb 2024 12 46 Pm 4043

మామూలుగా చాలామంది భగవంతుడికి పూజ చేసే క్రమంలో ఎన్నో రకాల పండ్లు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. కొందరు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పండుని సమర్పిస్తూ ఉంటారు. వివిధ కాలాలలో వచ్చే పండ్లతో పాటు, అరటి పండ్లు, ఆపిల్స్ తదితరాలు భగవంతుడికి నైవేద్యంగా పెడతారు. అయితే దేవుళ్లకు ఎలాంటి పండ్లను పెట్టాలి? వాటి వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది సహజంగా భగవంతుడికి నైవేద్యంగా పూర్ణ ఫలమైన కొబ్బరికాయను సమర్పిస్తారు. భగవంతుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించడం వల్ల మొదలు పెట్టిన అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. చాలామంది భగవంతుని పూజలో అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

అరటి పండు నైవేద్యంగా సమర్పించడం వల్ల సకల కార్యసిద్ధి జరుగుతుంది. అంతేకాదు అరటి పండును గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పించడం వల్ల అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. చేజారి పోయిన సొమ్ము సకాలంలో తిరిగి లభిస్తుంది. అరటి పండు నైవేద్యంగా సమర్పిస్తే ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. భగవంతుడికి ఆపిల్ పండు నైవేద్యంగా పెడితే దారిద్రం తొలగిపోయి ధనవంతులు అవుతారట. కమలా పండుని భగవంతునికి నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తవుతాయి. సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారి వివాహ అవాంతరాలు తొలగిపోయి వివాహం జరుగుతుందని చెబుతారు.

మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసినటువంటి నగదు ఎటువంటి అవాంతరాలు లేకుండా తిరిగి మనకు చేరుతుందని చెబుతారు. పనస పండును దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనం అవుతుందని, రోగ విముక్తి కలిగి సుఖంగా జీవిస్తారు. ద్రాక్ష పండ్లను భగవంతునికి నైవేద్యంగా పెట్టి వాటిని చిన్న పిల్లలకు, పెద్దలకు పంచితే ఎప్పుడూ సుఖసంతోషాలతో జీవిస్తారని, రోగాలు నశించి, పనులు సకాలంలో పూర్తవుతాయట. శనీశ్వరుడుకి నేరేడు పండును నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పి తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. అంజీర పండ్లు భగవంతుడికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి, మీరు తర్వాత తింటే అనారోగ్య బాధలు తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారట.