దీపావళి పండుగకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది. దీపావళి పండుగ అంటే వెలుగుల పండుగ. ఈ రోజున ఇంటిని అందంగా దీపాలతో అలంకరిస్తూ ఉంటారు. అయితే మాములుగా ఈ దీపావళి పండుగకు లక్ష్మిదేవిని పూజిస్తూ ఉంటారు. కానీ కొన్ని రాశుల వారు దీపావళి ఒక్కొక్క విధంగా పూజించాలనీ చెబుతున్నారు. రాశిఫలాల ఆధారంగా లక్ష్మీ దేవికి వివిధ అవతారాలు ఆపాదించారు. మీ రాశి ఫలాలను బట్టి దేవత అవతారాన్ని విశిష్టంగా కొలవడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనాలు ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మేష, వృశ్చిక రాశులవారు మంగళ గ్రహం లేదా మార్స్‌కు చెందినవారుగా భావిస్తారు. కాబట్టి వీళ్లు మాతా భగవతీ అవతారాన్ని కొలిస్తే మంచిది. మా భగవతీ అవతారాన్ని కొలవడం వల్ల ఈ రాశులకు చెందినవారు అనేక ప్రయోజనాలు పొందగలుగుతారు. పసుపు రంగులో పువ్వులను, గులాబీలను దేవతకు ప్రసాదించాలి. గోదుమ పిండి, బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టడం మంచిదట.
అలాగే వృషభ, తుల రాశులవారు ఈ పండుగ సందర్భంగా మాతంగి దేవిని కొలిస్తే శుభ ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. ఈ రాశులకు చెందినవారు శుక్ర గ్రహానికి చెందినవారుగా భావిస్తారు. వీళ్లు మాతంగి దేవిని పూజించడం వల్ల సిరిసంపదలు వెల్లివిరుస్తాయట. ఈ సందర్భంగా మాతకు పవిత్రమైన జలాన్ని, తెల్లని పువ్వులతో పూజించాలట. దీంతో వారి జీవితాల్లో సంతోషాలు, సిరిసంపదలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు.
మిథునం,కన్యారాశుల వారు బుధగ్రహానికి చెందినవారుగా భావిస్తారు. అయితే ఈ రాశివారు మాతా భగవాన్ త్రిపుర భైరవి మాత రూపంలో ఉన్న లక్ష్మీ దేవతను కొలిస్తే మంచి ఫలితం ఉంటుందట. ముఖ్యంగా దీపావళి రోజున ఈ అవతారంలో ఉన్న మాతను కొలిస్తే సకల సంపదలు, సుఖసంతోషాలు, మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని నమ్మకం. సుగంధి పాలను నైవేద్యంగా, పవిత్ర జలంతో, గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించడం మంచిదని చెబుతున్నారు.
కర్కాటక రాశివారిని చంద్రుడు ఏలుతాడు అని చెబుతారు. ఈ రాశిలో జన్మించినవారు దుర్గామాత అవతారాన్ని కొలిస్తే సత్ఫలితాలు ఉంటాయట. దుర్గామాత చల్లగా చూస్తుందట. అంతేకాకుండా మనసుకు ప్రశాంతతను, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందట. దుర్గామాతకు దీపావళి రోజున క్షీరాన్నంతో నైవేద్యం పెట్టాలని, తెల్లని మల్లె పూలతో దేవతను కొలవాలని చెబుతున్నారు. దుర్గా మాత ఆశీస్సులతో భోగభాగ్యాలు అందుతాయని పండితులు చెబుతున్నారు.
అదేవిధంగా సింహ రాశి వారు సోనాక్షి మాతను కొలిస్తే మంచిదట.. దీపావళి రోజున ఈ రాశివారు సోనాక్షి మాతను కొలిస్తే మంచిదట. గులాబీ, కమలం పువ్వులతో పూజిస్తే ఆర్థికపరంగా మంచి లాభాలను పొందవచ్చు అని చెబుతున్నారు.
అలాగే ధను రాశి మీన రాశి వారు మాత బంగ్లా దేవిని దీపావళి రోజున పూజించడం వల్ల అదృష్టం కలిసొస్తుందట. ఈ రాశులవారు బృహస్పతి గ్రహం అధీనంలో ఉంటారని అంటారు. మాత బంగ్లాదేవి, మాత భగవతి రూపంలోని దేవతలను పూజిస్తే జీవితంలో చక్కని అదృష్టం కలిసొస్తుందట. దేవతలకు మొగ్రా పువ్వులతో అలంకరించాలట. ఇంకా బియ్యం, పసుపు, కుంకుమలను ముందుంచి పూజిండం వల్ల సంపదను, అదృష్టాన్ని ఇవి ఆహ్వానిస్తాయని చెబుతున్నారు.
మకర, కుంభ రాశులకు చెందినవారు దీపావళి రోజున కాళి మాతను పూజిస్తే బాగుంటుందని చెబుతారు. కాళిక మాతను మొగ్రా, మల్లె, నైట్ క్వీన్ పువ్వులతో ప్రసన్నం చేసుకోవాలట. బాదం హల్వా కాళి మాతకు ప్రీతిపాత్రమైనది. ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే నైవేద్యంగా బాదం హల్వా పెట్టి మాతను కొలిస్తే ఫలితం ఉండవచ్చట.