Site icon HashtagU Telugu

Shiva: శివుడికి తుమ్మి పువ్వులు ఎందుకంత ఇష్టమో తెలుసా?

Mixcollage 14 Jul 2024 04 59 Pm 3793

Mixcollage 14 Jul 2024 04 59 Pm 3793

హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. ఈ పరమేశ్వరుని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా ఎన్నో శివాలయాలు కూడా ఉన్నాయి. ఇకపోతే శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తుమ్మి పువ్వులు కూడా ఒకటి. మరి పరమేశ్వరుడికి తుమ్మి పువ్వులు అంటే ఎందుకు అంత ఇష్టం? వీటిని పూజలో ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పరమేశ్వరుడికి రెండు రకాలైన పుష్పాలను ఎట్టిపరిస్థితుల్లో పొరపాటున కూడా సమర్పించవద్దు.

ఒకవేళ అలా సమర్పిస్తే జీవితంలో ఎన్నో కష్టాలను, నష్టాలను అనుభవించాల్సి వస్తుందట. వెయ్యి తెల్లజిల్లేడు పుష్పాలను తెచ్చి శివసహస్రనామం చదివి శివలింగంపైన వేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో ఒక గన్నేరు పుష్పాన్ని శివలింగంపైన పెడితే అంత ఫలితం వస్తుంది అని శాస్త్రం మనకు చెబుతోంది. వెయ్యి గన్నేరు పుష్పాన్ని శివసహస్రనామం చదివి శివలింగంపైన పెడితే ఎంత పుణ్యమైతే వస్తుందో అంతే పుణ్యం ఒక్క మారేడు దళం శివలింగంపైన పెడితే అంత ఫలితం వస్తుంది. ఒక బిల్వపత్రాన్ని శివలింగంపైన పెడితే మూడు జన్మల పాపాలను శివుడు హరించివేస్తాడట. అదేవిధంగా వెయ్యి బిల్వ దలాలను శివలింగం పైన వేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితం ఒక్క తామర పువ్వును శివలింగం పైన పెడితే వస్తుందట.

వెయ్యి తామర పుష్పాలను శివలింగం పైన పెడితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఒక్క ఉమ్మెత్తు పువ్వును శివలింగంపైన పెడితే వస్తుందట. అలాగే వెయ్యి ఉమ్మెత్త పువ్వులను తీసుకొచ్చి శివలింగం పైన పెడితే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితం ఒక్క జమ్మి పువ్వును పెడితే వస్తుందని శాస్త్రం చెబుతోంది. వెయ్యి జమ్మి పువ్వులను శివలింగం పైన పెడితే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితం ఒక్క తుమ్మి పువ్వు పెడితే వస్తుందట. పరమేశ్వరుడికి తుమ్మి పువ్వు అంటే చాలా ఇష్టం. మారేడు పువ్వు కంటే కూడా తుమ్మి పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టమని శివపురాణం చెబుతోంది. శివుడికి తుమ్మి పువ్వు ఎందుకిష్టమనేదానిపై శివపురాణంలో ఒక కథ కూడా వుంది. శివుడికి ఎన్ని పుష్పలతో పూజ చేసినా తుమ్మి పువ్వులతో పూజ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంటున్నారు పండితులు.