Site icon HashtagU Telugu

Vasthu Tips: వాస్తు ప్రకారం ఉసిరి చెట్టు ఇంట్లో ఏ దిశలో ఉండాలి? ఏ దిశలో ఉంటే మంచి జరుగుతుందో తెలుస

Amla

Amla

హిందూమతంలో వాస్తు ప్రకారం ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వాస్తు ప్రకారం మొక్కలను అదే దిశలో పెంచుతూ ఉంటారు. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుందని లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకునే మొక్కలలో ఉసిరి చెట్టు కూడా ఒకటి. కొందరు వాస్తు ప్రకారంగా ఈ మొక్కను పెంచుకుంటే మరికొందరు మాత్రం ఎలాంటి వాస్తు నియమాలు పట్టించుకోకుండా ఇంట్లో ఉసిరి మొక్కను పెంచుతూ ఉంటారు.

అయితే మరి ఉసిరి మొక్క విషయంలో ఇలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. అందకే ఈ చెట్టును, దీని కాయను విష్ణువుకు ఇష్టమైనదిగా భావిస్తారు. కార్తీక మాసంలో శుక్ల పక్షం తొమ్మిదవ రోజును ఉసిరి నవమి అని కూడా అంటారు. ఈ రోజు విష్ణు మూర్తిని, లక్ష్మీ దేవిని, ఉసిరి చెట్టును ఖచ్చితంగా పూజిస్తారు. అంతేకాదు ఈ రోజు మీరు ఉసిరి చెట్టు నీడలో కూర్చుని అన్నం తింటే మీకున్న ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అలాగే వ్యక్తులు చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయని నమ్ముతారు.

ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉసిరి చెట్టును నాటాలి. ఈ దిశలో ఉన్న ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. అలాగే ఇది ఇంటికి మంచిది. అలాగే ఉసిరి చెట్టును క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంట్లో దేవతలు, దేవుళ్లు ఉంటారట. ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో ఉసిరి చెట్టును నాటడం, క్రమం తప్పకుండా ఆ చెట్టుకు నీరు పోయడం వల్ల మీ కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు ఉంటాయట. అలాగే ఇంట్లోని నెగిటీవ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. దీని వల్ల మీ కుటుంబంలో సంపద మార్గం వస్తుందని చెబుతున్నారు.