Site icon HashtagU Telugu

Footwear Vastu : చెప్పులు ఇలా విడిస్తే ఇక కష్టాలే

Footwear Vastu

Footwear Vastu

Footwear Vastu : దేవాలయాల్లోకి, ఇళ్లలోకి వెళ్లే ముందు చెప్పులను బయట వదలాలి..

అయితే చెప్పులను ఎటువైపు వదలాలి ?

దీనికి వాస్తు శాస్త్రం చెబుతున్న ఆన్సర్స్ ఏమిటి ?

మన ఇంటి సింహద్వారం అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపం. అందుకే  ఇంటి సింహద్వారం ఎదురుగా చెప్పులను(Footwear Vastu) విడవకూడదు.  సింహద్వారం ఎదురుగా చెప్పులు విడిస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. చెప్పుల స్టాండ్ ఎక్కడుందో చూసి అక్కడ చెప్పులను విడిచి రావాలి. ఇలాచేస్తే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. చెప్పులతో ఇంట్లోకి రాకూడదు అనేందుకు ఒక సైంటిఫిక్ కారణం కూడా ఉంది. మన రోడ్డుపైన తిరిగినప్పుడు చెప్పులలోకి వందలాది సూక్ష్మ క్రిములు చేరుతాయి. అవే చెప్పులతో ఇంట్లోకి ఎంటర్ అయితే అనారోగ్య సమస్యలు వస్తాయి.

Also read : Vastu Shastra : ఈ రోజు గుడిలో చెప్పులు పోగొట్టుకుంటే మీఅంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు..!! 

పూర్వకాలంలో ఇంటి బయట చెప్పులు విడిచి.. కాళ్లు కడుక్కుని లోపలికి  వచ్చేవారు. చెప్పుల స్టాండ్ ను పశ్చిమ, నైరుతి దిశల్లో ఉంచడం మంచిది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉత్తరం, ఆగ్నేయం, తూర్పు దిశలో చెప్పుల స్టాండ్ ను ఉంచకూడదు. ఇల్లు చిన్నదిగా ఉండటం వల్ల చాలాసార్లు షూ-రాక్‌ని కొందరు బెడ్‌రూమ్‌లోనే ఉంచుతారు. కానీ వాస్తు ప్రకారం ఇది ఇంటికి హానికరం. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల దాంపత్య జీవితంలో అలజడి వస్తుంది. గొడవల వాతావరణం నెలకొంటుంది.

Also read : Amitabh Bachchan: అభిమానుల్ని కలిసినప్పుడు అమితాబ్ చెప్పులు వేసుకోరు ఎందుకో తెలుసా?

వంటగదిని సాక్షాత్తు అగ్నిదేవుడిగా భావిస్తాం. అందుకే వంటగదిలోకి చెప్పులు వేసుకొని వెళ్ళం. డబ్బులు, బంగారం దాచే చోటుకు కూడా చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. నదుల సందర్శనకు వెళ్ళినప్పుడు కూడా చెప్పులు ధరించకూడదు. చెప్పులు ధరించి నదిలోకి దిగకూడదు.  ఈశాన్య దిశలో పొరపాటున కూడా చెప్పులు,బూట్లు పెట్టకూడదు. ధరించకూడదు. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి చితికిపోయి అప్పులపాలవుతుంది.

గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.