Site icon HashtagU Telugu

New Clothes: వారంలో ఈరోజు కొత్త దుస్తులు ధరించకూడదో మీకు తెలుసా?

Mixcollage 11 Jun 2024 06 54 Am 8380

Mixcollage 11 Jun 2024 06 54 Am 8380

మాములుగా హిందువులు వారంలో కొన్ని కొన్ని రోజులు కొన్ని రకాల పనులు చేయడం నిషేధంగా భావిస్తారు. కొందరు మూఢనమ్మకాలు అని కొట్టి పారిస్తే మరి కొందరు మాత్రం వాటిని పాటిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో వారంలో కొన్ని రోజులు దుస్తులు వేసుకోకూడదు అన్న నియమం కూడా ఒకటి. పిల్లలు పదే పదే కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు మందలిస్తూ ఉంటారు. అలాగే వారంలో కొన్ని రోజుల్లో కొత్త దుస్తులు ధరించకూడదని చెబుతూ ఉంటారు. మరి వారంలో ఏ రోజు కొత్త బట్టలు ధరించకూడదు?

అలా ధరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం… వారంలో మూడు రోజులు కొత్త దుస్తులను ధరించకూడదు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఒకవేళ మీరు కూడా ఆ కొత్త దుస్తులను వేసుకుంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇంతకీ ఏ వారాలు అన్న విషయానికి వస్తే.. ఆదివారం కొత్త బట్టలు వేసుకోకూడదట. కాగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం రోజు కొత్త దుస్తులను వేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి జాతకంలో సూర్య గ్రహం ప్రభావం ఉండవచ్చు. ఇది జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

అలాగే మీరు ఆదివారం రోజు కనుక కొత్త దుస్తులను దరిస్తే మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే మంగళవారం కొత్త దుస్తులు ధరించకూడదు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి బట్టలు త్వరగా చిరిగిపోతాయని నమ్ముతారు. అలాగే మంగళవారం నాడు కొత్త దుస్తులు ధరిస్తే, అతని స్వభావంలో కోపం పెరిగే అవకాశం ఉంటుందట. అలాగే శనివారం నాడు కొత్త కొత్త బట్టలు ధరించకూడదు. ఇలా చేయడం వల్ల శనిదేవుడికి ఆ వ్యక్తిపై కోపం వస్తుందట. అలాగే శనివారం నాడు కొత్త బట్టలు ధరిస్తే ధననష్టం కలుగుతుందట. అలాగే వ్యక్తి జాతకంలో శని లోపం సంభవించవచ్చట.