నేడే వరలక్ష్మీ వ్రతం. ఆగస్టు 16వ తేదీ రోజు మాత్రమే కాకుండా శ్రావణమాసంలో ఏ శుక్రవారం రోజు అయినా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. శ్రావణ శుక్రవారంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని స్త్రీలు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సౌభాగ్యం కోసం అష్ట ఐశ్వర్యాల కోసం కుటుంబ క్షేమం కోసం స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం చేయడం మంచిదే కానీ వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లు అస్సలు చేయకూడదని చెబుతూ ఉంటారు. అదేవిధంగా వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు కొన్ని రకాల విషయాలను కూడా గుర్తుంచుకోవాలట.
ముఖ్యంగా మనం ధరించి బట్టలు, వాటి కలర్ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. మరి ఈ పూజా సమయంలో ఎలాంటి రంగు చీర కట్టుకోవాలో, ఏ రంగు చీరకు దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారు ఎలాగైతే బంగారు వర్ణ చాయలో, మేలిమి బంగారు నగలతో మెరిసిపోతారో, అలాగే మనం కూడా అమ్మవారి ఆశీస్సుల కోసం బంగారు రంగు చీర కట్టుకుంటే శుభ్రప్రదం అని చెబుతున్నారు. నిజంగా బంగారు వర్ణం దుస్తులు ధరించడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందట. అలాగే శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి ఆకుపచ్చ రంగుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
ఆకుపచ్చ రంగు గాజులు, చీర కట్టుకోవడం వల్ల కుటుంబంలో, జీవితంలో సంతోషం నెలకొంటుందని నమ్ముతారు. వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు కూడా ఈ ఆకుపచ్చ చీరలో వ్రతం అచరిస్తే శ్రేయస్సు కలుగుతుందని, అమ్మవారి కటాక్షం పొందొచ్చని పండితులు చెబుతున్నారు.బంగారు, ఆకుపచ్చ రంగులతో పాటే.. అమ్మవారికి సూర్యుని రంగైన ఎరుపు, ఆ కలువ పువ్వు రంగైన గులాబీ రంగు, పసుపు, గోధుమ రంగులు కూడా ఇష్టమే. ఈ రంగు చీరల్లో పూజ ఆచరించవచ్చు. అలాగే మీ దగ్గరున్న బంగారు నగలు పూజ చేసేటప్పుడు వేసుకోవచ్చు. ఆకుపచ్చ, ఎరుపు రంగుల గాజులు ధరించడం మరింత మంచిది. మరి ఎటువంటి రంగులు ధరించకూడదు అన్న విషయానికి వస్తే.. పూజ చేసే సమయంలో నలుపు , ముదురు నీలం బూడిద రంగు, సిమెంట్ కలర్ వంటి రంగులను ధరించకపోవడం మంచిది అని చెబుతున్నారు.