Site icon HashtagU Telugu

Hanuman Photo: ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటోను ఏ దిశలో పెట్టుకోవాలో తెలుసా.. పండితులు ఏం చెబుతున్నారంటే!

Hanuman Photo

Hanuman Photo

హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే దేవుళ్ళలో హనుమంతుడు కూడా ఒకరు. చిన్న చిన్న గ్రామాలలో ప్రతి ఊరికి ఒక ఆంజనేయస్వామి దేవాలయం తప్పనిసరిగా ఉంటుంది. ఆంజనేయ స్వామి దేవాలయం లేకుండా దాదాపుగా గ్రామాలు ఉండవేమో అని చెప్పవచ్చు. మామూలుగా మనం ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహాలు ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాము. అయితే ఈ విషయంలో చాలామంది తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహం లేదా ఫోటో ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎల్లప్పుడూ దక్షిణ దిశలో ఉండేలా చూసుకోవాలట.

అలాగే కేవలం కూర్చున్న భంగిమలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది అని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయట. అలాగే ఆంజనేయస్వామి చిత్రపటాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలట. నిత్యం స్వామిని పూజిస్తూ మంగళవారం సుందరకాండ పారాయణం చేయాలని చెబుతున్నారు. అప్పుడే మీకు హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయట. ఇంట్లోని చీడ, పీడలను, దుష్టశక్తులను వదిలించుకోవడానికి ఇంటి దక్షిణ దిశ గోడపై కూర్చున్న భంగిమలో ఉన్న హనుమాన్ ఫొటోను తగిలించుకోవాలని చెబుతున్నారు. అయితే ఈ ఫొటోలోని హనుమంతుడు ఎరుపు రంగులో ఉండే విధంగా చూసుకోవాలంటున్నారు. కాగా శత్రువులు, గృహ బాధలు, సంబంధాల్లో విభేదాలు, కుటుంబంలో ప్రతికూలతలు నివారించేందుకు వాస్తుప్రకారం పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడం మంచిదని చెబుతున్నారు.

అయితే ఈ చిత్రపటం ప్రధాన ద్వారం పైన ఉంచడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుందట. మీరు ఇంట్లోని డ్రాయింగ్ రూమ్​లో శ్రీరామ దర్బార్ విగ్రహాన్ని పెట్టుకోవచ్చని చెబుతున్నారు పండితులు. అలాగే పంచముఖ ఆంజనేయస్వామి, హనుమంతుడు పర్వతాన్ని ఎత్తుతున్న ఫోటోను కూడా ఈ గదిలో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ఉద్యోగం వ్యాపారంలో పురోగతి కావాలి అంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. హనుమంతుడి శరీరంపై తెల్ల వెంట్రుకలు ఉన్న ఫోటోని ఎంచుకుంటే మరీ మంచిదని చెబుతున్నారు. ఆంజనేయ స్వామి ఫోటోని పడక గదిలో అస్సలు ఉంచకూడదు. ఇలా చేస్తే అనేక రకాల సమస్యలు వస్తాయట.