Site icon HashtagU Telugu

Buddha Statue: బుద్ద విగ్రహం ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి? అక్కడ పెట్టుకుంటే మంచి జరుగుతుందా..?

Whatsapp Image 2023 05 11 At 21.43.52

Whatsapp Image 2023 05 11 At 21.43.52

Buddha Statue: ఇంట్లో చాలామంది బుద్దుడి విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. లాఫింగ్ బుద్దాతో పాటు బుద్ద విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో ప్రశాంతత కోసం మంచి జరుగుతుందనే నమ్మకంతో ఇంట్లో బుద్ద విగ్రహలు పెట్టుకుంటారు. అలాగే బుద్దుడి విగ్రహం ఇంటికి మంచి అందాన్ని కూడా ఇస్తుంది. ఇంట్లో చాలామంది బుద్ద విగ్రహాలను తీసుకొచ్చి ఇంట్లో అలకరించుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లో బుద్ద విగ్రహం ఎక్కడ పెట్టుకోవాలనే దానిపై వాస్తును ఫాలో అవ్వాలని వాస్తు పండితులు చెబుతున్నారు.

వాస్తు ప్రకారం బుద్ద విగ్రహన్ని పెట్టుకుంటే మంచి జరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. పిల్లలు చదువుకునే ప్రాంతాల్లో బుద్ద విగ్రహం పెడితే మంచి జరుగుతుందని చెబుతున్నారు. దీని వల్ల పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టగలుగుతారని, వారితో ఏకాగ్రత కూడా పెరుగుతుందని అంటున్నారు. దీని వల్ల పిల్లలకు చదువుపై ఆసక్తి బాగా పెరుగుతుందని చెబుతున్నారు. పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదని భావిస్తే బుద్ద విగ్రహం పెట్టడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

ఇక పూజ గదితో పాటు యోగా, ధ్యానం చేసే దగ్గర కూడా బుద్ద విగ్రహం పెట్టుకోవాలని చెబుతున్నారు. దీని వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, పక్క విషయాలపైకి ధ్యాస వెళ్లదని, మనస్సులోకి వేరే ఆలోచనలు రావని చెబుతున్నారు. ఇంట్లోని తూర్పు భాగంలో బుద్ద విగ్రహన్ని పెట్టి పూజిస్తే మంచి జరుగుతందని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అలగే లివింగ్ రూమ్ లో కూడా బుద్ద విగ్రహం పెట్టుకోవచ్చని, శుభ్రంగా ఉండే టేబుల్ లేదా షెల్స్ లో ఉంచుకుంటే ఇల్లు శాంతంగా కనిపిస్తుందని చెబుతున్నారు.అయితే బుద్ద విగ్రహం ఎప్పుడూ నేల మీద పెట్టకూడదని, కంటి చూపు కంటే పై స్థాయిలో ఉండే విధంగా చూసుకోవాలని చెబుతున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులైన ఫ్రిజ్, టీవీ లాంటి వస్తువులపై బుద్ద విగ్రహం పెట్టడం మంచిది కాదని చెబుతున్నారు. ఇక స్టోర్ రూమ్, లాండ్రి గదులలో పెట్టకూడదని చెబుతున్నారు.

Exit mobile version