Site icon HashtagU Telugu

Dasara 2025 : రావణ దహనం ముహూర్తం ఎప్పుడంటే!!

Ravana Dahanam

Ravana Dahanam

ప్రతి ఏడాది ఆశ్వయుజ మాస శుక్ల పక్ష దశమి తిథిన విజయదశమి (Dasara) లేదా దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆరోజు శ్రీరాముడు రావణుడిని సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే రామలీలలలో భాగంగా రావణ, కుంభకర్ణ, మేఘనాథుల బొమ్మలను దహనం చేస్తారు. అలాగే దుర్గాపూజ, ఆయుధపూజ వంటి ప్రత్యేక పూజలు ఈ రోజున నిర్వహిస్తారు. దృక్ పంచాంగం ప్రకారం 2025లో దసరా అక్టోబర్ 2, గురువారం జరగనుంది. అక్టోబర్ 1న మధ్యాహ్నం 2:21 వరకు నవమి తిథి ఉండగా, ఆ తర్వాత నుంచి దశమి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 2న మధ్యాహ్నం 2:45 వరకు దశమి కొనసాగుతుంది కాబట్టి, సూర్యోదయ తిథి ప్రకారం గురువారమే విజయదశమి.

Art Connect and A&H Colab to host LUME/VYANA : సెప్టెంబర్ 15న ఫిలిం నగర్ లో ‘లూమే//వ్యాన’ ఎగ్జిబిషన్

ఈ సంవత్సర దసరా రోజున రవి యోగం రోజంతా ఏర్పడుతోంది. దీని వల్ల దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం. ఉదయం నుంచి రాత్రి 11:29 వరకు సుకర్మ యోగం ఉండగా, ఆ తర్వాత ధృతి యోగం ప్రారంభమవుతుంది. నక్షత్రాల పరంగా చూస్తే ఉదయం 9:13 వరకు ఉత్తరాషాఢ నక్షత్రం, ఆ తర్వాత రోజు మొత్తం శ్రవణ నక్షత్రం ఉంటుంది. దసరా శుభ ముహూర్తం ఉదయం 4:38 నుంచి 5:26 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:34 వరకు, విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:09 నుంచి 2:40 వరకు ఉంటుంది. అయితే ఉదయం 10:16 నుంచి 11:55 వరకు వర్జ్యం, ఉదయం 9:53 నుంచి 10:41, తిరిగి మధ్యాహ్నం 2:40 నుంచి 3:28 వరకు దుర్ముహూర్తం ఉంది కాబట్టి ఆ సమయంలో పూజలు చేయకూడదు.

ఆయుధపూజ దసరా రోజు ముఖ్యమైన ఆచారం. ఈ సంవత్సరం దానికి శుభ సమయం మధ్యాహ్నం 2:09 నుంచి 2:40 వరకు ఉంది. ఈ సమయంలో ఆయుధాలను పూజిస్తే విజయం, శక్తి లభిస్తాయని నమ్మకం. ఇక రావణ దహనం మాత్రం ప్రదోషకాలంలో చేయాలి. ఈసారి సూర్యాస్తమయం సాయంత్రం 6:06కు జరుగుతుంది. ఆ తరువాత ప్రారంభమయ్యే ప్రదోషకాలంలో రావణ దహనం చేయడం శాస్త్రోక్తం. ఈ విధంగా దసరా పండుగలో పూజలు, యోగాలు, ముహూర్తాలు అన్నీ శాస్త్రోక్తంగా జరిపితే ఆధ్యాత్మిక, శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.