Site icon HashtagU Telugu

Solar Eclipse: 2025లో రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు?

Lunar Eclipse

Solar Eclipse

Solar Eclipse: సూర్యగ్రహణ కాలాన్ని జ్యోతిష్యం, శాస్త్రాలలో అశుభంగా పరిగణిస్తారు. అందుకే ఈ సమయంలో కొన్ని నియమాలను పాటించడం తప్పనిసరి. గ్రహణం వల్ల కలిగే చెడు ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 2025లో రెండవ సూర్యగ్రహణం (Solar Eclipse) ఎప్పుడు వస్తుంది? ఆ సమయంలో పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2025లో రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు?

2025లో మొదటి సూర్యగ్రహణం మార్చి 29న సంభవించింది. ఇప్పుడు రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21, 2025న ఏర్పడుతుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. పంచాంగం ప్రకారం.. ఈ రోజు అశ్వినీ మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య. భారత కాలమానం ప్రకారం.. సూర్యగ్రహణం రాత్రి 11 గంటలకు ప్రారంభమై, తెల్లవారుజామున 3 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది. ఈ గ్రహణం ఫిజీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా వంటి దేశాల్లో కనిపిస్తుంది. అయితే మొదటి గ్రహణం మాదిరిగానే ఇది కూడా భారతదేశంలో కనిపించదు. సూతక కాలం కూడా వర్తించదు. భారత్‌తో పాటు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాల్లో కూడా ఈ గ్రహణం కనిపించదు.

జ్యోతిష్యుల ప్ర‌కారం.. సెప్టెంబర్ 21న కన్యా రాశి, ఉత్తరా ఫాల్గుణి నక్షత్రంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి లేదా నక్షత్రంలో జన్మించిన వారు గ్రహణం సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశితో పాటు మరికొన్ని రాశులపైనా సూర్యగ్రహణం ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి.

Also Read: Ajinkya Rahane: అజింక్య రహానే సంచ‌ల‌న నిర్ణ‌యం!

సూర్యగ్రహణం వల్ల ప్రతికూల ప్రభావం పడే రాశులు

మిథున రాశి: మీ రాశికి సూర్యుడు మూడవ ఇంటికి అధిపతి. కాబట్టి గ్రహణ ప్రభావం మీ నాల్గవ ఇంటిపై ఉంటుంది. ఈ సమయంలో మీ తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు మానసిక అశాంతితో బాధపడవచ్చు. దాని నుంచి బయటపడటానికి మంత్రాలు జపించాలి. ఇల్లు, వాహనం సంబంధిత సమస్యలు ఉండవచ్చు. ప్రేమ లేదా వైవాహిక జీవితంలో కూడా ఒత్తిడి ఏర్పడవచ్చు.

సింహ రాశి: సూర్యుడు మీ రాశికి అధిపతి, సూర్యగ్రహణం మీ రెండవ ఇంటిని ప్రభావితం చేస్తుంది. రెండవ ఇంట్లో సూర్యుని సంచారం లేదా గ్రహణం జ్యోతిషశాస్త్రంలో మంచిది కాదు. కాబట్టి సింహ రాశి వారు గ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కంటి సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

కుంభ రాశి: సూర్యుడు మీ రాశికి ఏడవ ఇంటికి అధిపతి, గ్రహణ ప్రభావం మీ ఎనిమిదవ ఇంటిపై పడుతుంది. దీని వల్ల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. సుదూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. అలాగే శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సూర్యగ్రహణ సమయంలో చేయకూడని పనులు