Makar Sankranti: మకర సంక్రాంతిని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. భారతీయ సంస్కృతి, జ్యోతిష్యం, ధర్మంలో ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 2026లో మకర సంక్రాంతి తేదీ, స్నాన, దాన సమయాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి.
మకర సంక్రాంతి 2026
మకర సంక్రాంతి వేల సంవత్సరాలుగా మన సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. చలికాలం ముగిసి, వేసవి కాలం ప్రారంభానికి సంకేతంగ, కొత్త ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకుంటారు.
మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశం
సూర్య భగవానుడు ధను రాశిని విడిచి మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర దినమే మకర సంక్రాంతి. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని ‘సంక్రాంతి’ అంటారు. అన్ని సంక్రాంతిలలో మకర సంక్రాంతికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.
మకర సంక్రాంతి ప్రాముఖ్యత
మకర సంక్రాంతితో సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. దీనిని ‘దేవతల పగలు’ అని పిలుస్తారు. ఉత్తరాయణం ఆధ్యాత్మిక పురోగతికి మరియు పుణ్యానికి అనువైన సమయంగా శాస్త్రాలు చెబుతున్నాయి. మహాభారతం ప్రకారం, భీష్మ పితామహుడు తన దేహాన్ని త్యజించడానికి ఉత్తరాయణం కోసమే వేచి చూశారు.PP అందుకే దీనిని మోక్ష కాలంగా భావిస్తారు. ఈ రోజున గంగా, యమునా లేదా ఏవైనా పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి అక్షయ పుణ్యం లభిస్తుంది.
Also Read: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వద్ద ఎంత సంపద ఉందంటే?
దాన ధర్మాల విశిష్టత
శాస్త్రాల ప్రకారం ‘మాఘే మసి దినే పుణ్యే, మకరస్తే దివాకరే’ అంటే మకర సంక్రాంతి రోజున చేసే దానం అనంతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున నువ్వులు, బెల్లం, కిచిడీ, వస్త్రాలు, ఆహారాన్ని దానం చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. నువ్వులు శని గ్రహానికి సంబంధించినవి కావడంతో వీటిని దానం చేయడం వల్ల శని దోషాలు శాంతిస్తాయి. ఉత్తర భారతదేశంలో సంక్రాంతిగా, తమిళనాడులో పొంగల్‌గా, అస్సాంలో భోగాలీ బిహుగా, పంజాబ్‌లో లోహ్రీగా ఈ పండుగను జరుపుకుంటారు.
మకర సంక్రాంతి 2026 తేదీ- శుభ ముహూర్తం
ఈ ఏడాది మకర సంక్రాంతి జనవరి 14, బుధవారం నాడు వచ్చింది. సూర్య సంక్రమణ సమయం మధ్యాహ్నం 3:06 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు. శుభ ముహూర్తం రాత్రి 8:42 గంటలకు ఉంటుంది. మహాపుణ్య కాలం ఉదయం 8:40 గంటలకు ప్రారంభమై ఉదయం 9:00 గంటల వరకు ఉంటుంది. పుణ్యస్నానం ఉదయం 9:30 గంటల నుండి 10:48 గంటల వరకు గంగా స్నానానికి అనువైన సమయం.
