కొత్త ఏడాది మొదలవగానే వచ్చే మొదటి పండుగ సంక్రాంతి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పండుగను 3 లేదా నాలుగు రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. మొదటిరోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ, నాలుగో రోజు ముక్కనుమ అంటూ నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు నువ్వులు తినడం శ్రేయస్కరం. స్నానం, దాన ధర్మాలు కూడా ఈ రోజున ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ రోజున ప్రజలు కూడా పవిత్ర నదులలో స్నానాలు చేస్తారు. అలాగే మకర సంక్రాంతి రోజు దానం చేయడం కూడా శుభప్రదంగా బావిస్తారు.
మకర సంక్రాంతి రోజున సూర్యుడు తన కుమారుడైన శని గ్రహాన్ని కలుస్తాడు. ఈ రోజున శుక్ర గ్రహం కూడా ఉదయిస్తుంది. ఈ రోజు నుండి శుభకార్యాలు ప్రారంభమవుతాయి. సూర్యుడు మకర రాశిలో ఉదయించగానే సూర్య దేవుడు దిగివచ్చి దేవతలకు పగలు, రాక్షసులకు రాత్రి మొదలవుతుంది. ఖర్మాలు ముగియడంతో మాఘమాసం ప్రారంభమవుతుంది. ఇకపోతే 2025లో మకర సంక్రాంతి జనవరి 14, మంగళవారం రోజు వచ్చింది. మకర సంక్రాంతి పుణ్యకాలం – 09:03 AM నుండి 05:46 PM వరకు, వ్యవధి 08 గంటల 42 నిమిషాలు. మకర సంక్రాంతి మహా పుణ్య కాలం సమయం 09:03 AM నుండి 10:48 AM వరకు ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ఉండడం వల్ల పుణ్యకాలంలో స్నానం చేసి దానం చేసిన తర్వాత పెరుగు, నువ్వులు తింటే శుభం కలుగుతుందట.
శుభ ముహూర్తంలో స్నానం చేసి, కంకణములు, నువ్వులు, మిఠాయిలు, కిచిడీ పదార్ధాలు, చలికాలంలో ఉపయోగించే దుప్పట్లు లేదా వస్త్రాలు దానం చేస్తారు. తర్వాత నువ్వుల హోమాన్ని ఆచరించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు ఉంటాయట. వాతావరణంలో మార్పులు సంక్రాంతి నుంచి చిన్నగా ప్రారంభం అవుతాయని చెబుతున్నారు. వాటిని శరీరం తట్టుకునేందుకు వీలుగా నువ్వులు తినడం మంచిదని సూచిస్తున్నారు. నీరు, ఎర్రటి పూలు, పూలు, బట్టలు, గోధుమలు, అక్షతలు, తమలపాకులు మొదలైన వాటిని మకర సంక్రాంతి రోజున అర్ఘ్య సమయంలో సూర్య భగవానుడికి సమర్పించాలి. పూజ తర్వాత ప్రజలు పేదలకు లేదా అవసరంలో ఉన్న వారికి దానం చేయాలి. మకర సంక్రాంతి రోజున కిచిడీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.