Site icon HashtagU Telugu

Divine Powers: దైవిక శక్తులు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాయి అనడానికి సంకేతాలు ఇవే?

Divine Powers

Divine Powers

మామూలుగా భవిష్యత్తులో కొన్ని సందర్భాలలో జరగబోయే కొన్ని సంఘటనల్లో మనకు ముందుగానే అర్థం అయ్యే విధంగా కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. మీకు ఎదుర‌య్యే ఇలాంటి అనుభూతులను ఎప్పుడూ విస్మరించకూడదు. ఈ సంకేతాలు దైవిక శక్తులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి మనల్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్నాయని అర్థం. ఫ‌లితంగా భ‌విష్య‌త్‌లో ఎదుర‌య్యే అనూహ్య‌మైన‌ లేదా అవాంఛనీయ సంఘటనల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

మరి దైవిక శక్తులు ఏదో చెప్పాలనుకుంటున్నాయి అనడానికి ఎటువంటి సంకేతాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు వెళ్లే దారిలో ఎక్కడో ఒకచోట ప‌క్షుల‌ ఈకలు చెల్లాచెదురుగా పడిఉండ‌టం తరచుగా మీకు క‌నిపిస్తుంటే, మిమ్మల్ని రక్షించడానికి ఒక అదృశ్య శక్తి ఎల్లప్పుడూ నీడ‌లా మీ వెన్నంటి ఉంద‌ని దైవిక శక్తుల నుంచి వచ్చిన సంకేతంగా చెప్పవచ్చు. ఇది కష్ట సమయాల్లో మీకు సహాయపడే అదృశ్య సానుకూల శక్తి. జ్యోతిషశాస్త్రంలో కొన్ని సంఖ్యలను చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. అలాంటి వాటిలో 3, 8 అనే రెండు సంఖ్యలు ముఖ్య‌మైన‌వి.

ఎవరైనా ఈ సంఖ్యలను పదే పదే చూసినట్లయితే, ఏదో ఒక దైవిక శక్తి మీతో నిరంతరం ఉంటుందని ఆ శక్తి మీకు మీకు ఏదో తెలియజేయాలనుకుంటోందని అర్థం. రెండెంక‌ల‌ సంఖ్యలను మళ్లీ మళ్లీ చూడటం కూడా ఈ అంశానికి సూచికగా భావించాలి. అలాగే మన శరీరానికి కేంద్ర బిందువు మ‌ణిపూర‌క‌ చక్రం. ఇది మన నాడీ వ్యవస్థలో కీల‌క పాత్ర పోషిస్తుంది. మెదడు నుంచి మన శరీరంలోని ఇతర భాగాలకు సందేశాలు పంపుతూ.. అదే సమయంలో ఆ భాగాల సందేశాలు మెదడుకు అందుతాయి. మీరు ఈ ప్రదేశంలో పదే పదే ఏదైనా అనుభూతి చెందుతుంటే లేదా మీరు ఆందోళన చెందుతుంటే, దైవిక శక్తులు మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయని అర్థం. మీ చెవిలో ఎవరైనా మీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారని మీరు పదేపదే అనుభూతి చెందుతుంటే, మీ చుట్టూ ఎవరి భౌతిక ఉనికిని మీరు చూడలేకపోతే దైవిక శక్తులు మీతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయని అర్థం.