Site icon HashtagU Telugu

Bride: కొత్త పెళ్లికూతుర్లు అత్తారింట్లో ముందుగా కుడికాలు ఎందుకు పెడతారో తెలుసా?

Bride

Bride

మామూలుగా పెళ్లి అయిన తర్వాత నూతన వధువు వరులు పుట్టింటికి లేదా మెట్టినింటికి వెళ్లినప్పుడు కొత్తకోడలిని కుడికాలు లోపలికి పెట్టి రమ్మని చెబుతూ ఉంటారు. అయితే కొత్తగా పెళ్లి అయిన నూతన వధువు పెళ్లి బట్టలతో కుడి కాలు పెట్టి గుమ్మం లోపలికి రావాలి అనే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. అయితే ఇలా ఎందుకు చేస్తారు, కానీ దీనివెనక ఉన్న రహస్యం, ఆంతర్యం మాత్రం కొద్ది మందికే మాత్రమే తెలుసు. ఎడమ కాలు పెడితే అశుభాలు జరుగుతాయని చాలామంది నమ్ముతారు. దీనికి రామాయణంలోని సన్నివేశంతో ముడిపడి ఉంది.

సీతను వెతుకుతూ లంకకు చేరుకున్న హనుమంతుడు, కావాలని తన ఎడమకాలును మొదట ఆ నేలమీద పెడతాడు. కుడిపాదం పెడితే రావణాసురుడికి సకల శుభాలు కలుగుతాయనీ, తాను వైరానికే సిద్ధపడి వచ్చాను కాబట్టి ఎడమ పాదం పెట్టడమే మంచిదనీ భావించి అలా చేస్తాడు. గొడవ పెట్టుకోవాలని వచ్చేవాళ్లు ఎడమ పాదమే ముందుగా మోపుతారని ఈ సన్నివేశం వివరిస్తోంది. శుభం జరగాలని కోరుకునేవారు ఎవరైనా కూడా కుడి పాదమే మోపాలని తెలుపుతుంది. ఎడమ పాదం ముందుగా ఇంట్లోకి పెడితే అక్కడ ఎప్పుడూ గొడవలు సమస్యలతో కాపురంలో కలహాలు ఎక్కువగా ఉంటాయని ఒక నమ్మకం ఉంది.

అలాగే కుడికాలు ముందు పెడితే సకల శుభాలు కలుగుతాయని భావిస్తూ వరుడుతో కలిసి నూతన వధువు తన అత్తగారింట్లోకి ముందుగా కుడికాలు పెడుతూ గృహ ప్రవేశం చేసే ఆచారం తరతరాలుగా వస్తోంది. కేవలం అత్త వారింటికి కోడలు వచ్చే విషయంలోనే కాదు ఎవరి బాగు కోరతామో వారి ఇంట్లో కుడిపాదం ముందుగా పెట్టాలని పండితులు సూచిస్తున్నారు. విశ్వంలోని గ్రహాలకు మనిషి శరీరంలోని భాగాలకు సంబంధం ఉందని శాస్త్రం చెబుతోంది. శిరస్సుకు సూర్యుడు, ముఖానికి చంద్రుడు కంఠానికి కుజుడు, శరీరంలోని ఎడమ భాగానికి బుధుడు, కుడి భాగానికి బృహస్పతి, హృదయానికి శుక్రుడు, మోకాళ్లకు శని, పాదాలకు రాహుకేతువులు ప్రాధాన్యం వహిస్తారు. శరీరంలో కుడి భాగానికి ప్రాధాన్యత వహించే బృహస్పతి సర్వ శుభకారకుడు అని చెబుతారు. అందుకే. తొలిసారి అత్తగారింటికి వచ్చే కొత్త కోడలు కుడికాలు గుమ్మంలో పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టడం మంచిదని శాస్త్రం చెబుతోంది.