Spirituality: పసుపు కుంకుమ పొరపాటున కింద పడితే ఏం జరుగుతుందో తెలుసా?

హిందూ సంప్రదాయంలో పసుపు,కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఏదైనా శుభకారానికి ఆహ్వానించే ముందు బొట్టు పెట్టి మరి పిలు

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 06:50 PM IST

హిందూ సంప్రదాయంలో పసుపు,కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఏదైనా శుభకారానికి ఆహ్వానించే ముందు బొట్టు పెట్టి మరి పిలుస్తూ ఉంటారు. అలాగే ఇంటికి వచ్చిన స్త్రీలకు పసుపు కుంకుమ పెట్టి మరీ పంపిస్తూ ఉంటారు. అయితే ఎంతో పరమ పవిత్రంగా భావించే పసుపు కుంకుమ కొన్ని కొన్ని సార్లు చేజారిపోతూ ఉంటుంది. అనుకోకుండా కొన్ని సార్లు కిందపడిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో చాలామంది ఏదైనా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు.

ఆ రోజంతా ఏదో ఆలోచనలోనే ఉండిపోతారు. అయితే ఇది ఏ మాత్రం నిజం కాదని కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పండితులు. అనుకోకుండా కుంకుమ కింద పడినప్పుడు అలా పడినచోట భూదేవికి బొట్టుపెట్టి మిగతా కుంకుమను చెట్లలో వేయాలి మంగళ, శుక్రవారాల్లో కుంకుమ కిందపడిందంటే చాలా ఫీలైపోతారు. కానీ అస్సలు బాధపడాల్సిన అవసరం లేదంటున్న పండితులు. ఆ రోజు ఇంటికి వచ్చిన ముత్తైదువుకు బొట్టుపెట్టి పంపించాలని చెబుతున్నారు. ఏదైనా పూజ, వ్రతం చేస్తున్నప్పుడు కుంకుమ, పసుపు చేజారి పడినా అతి ఎంతమాత్రం అపశకునం కాదు.

వాస్తవానికి కుంకుమ కిందపడడం అంటే భూదేవికి బొట్టుపెట్టాం అనేందుకు సంకేతం. అంటే మన అమ్మకు మనం బొట్టుపెట్టాం అన్నమాట. కాబట్టి పసుపు కుంకుమ చేయి జారి కింద పడిపోయినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఏ వేలుతో బొట్టు పెట్టుకుంటే మంచిది అన్న విషయానికి వస్తే… ఉంగరం వేలితో బొట్టు పెట్టుకుంటే శాంతి, మధ్య వేలితో బొట్టుపెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుంది. అలాగే బొటన వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది. చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదు.