Site icon HashtagU Telugu

Bay Leaf: ఇంట్లో రాత్రిపూట బిర్యానీ ఆకులను కాల్చితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 09 Jul 2024 07 21 Am 8244

Mixcollage 09 Jul 2024 07 21 Am 8244

మనం వంటల్లో ఉపయోగించే బిర్యానీ ఆకులకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బిర్యానీ ఆకులు కేవలం వంటల్లో ఉపయోగించడానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా బిర్యానీ ఆకులను ఇంట్లో రాత్రిపూట కాల్చడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి అంటున్నారు వాస్తు శాస్త్రం నిపుణులు. మరి రాత్రిపూట ఇంట్లో రెండు బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయి,ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ ఇంట్లో ఏదైనా ప్రతికూలత అనిపిస్తే ప్రతిరోజూ రాత్రి రెండు బిర్యానీ ఆకులను కాల్ చేయడం మంచిది అంటున్నారు.

ఎందుకంటే ఇది అన్ని రకాల ప్రతికూల శక్తులను నాశనం చేస్తుందట. అలాగే ఇది మీ ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీని దూరం చేస్తుందట. కాగా మాములుగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. మీ కుటుంబం గనుక మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటే ప్రతిరోజూ రాత్రిపూట ఇంట్లో బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల అది మీ ఒత్తిడిని తగ్గిస్తుందట. మామూలుగా కొందరు ఇళ్లలో కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్యానికి గురువుతూ ఉంటారు. ఇక అలాంటి వారు కూడా సాయంత్రం పూట రెండు బిర్యాని ఆకులను ఇంట్లో కాల్చడం వల్ల ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా చాలా మందికి రాత్రిపూట పీడకలలు వస్తుంటాయి.

ఇలా మిమ్మల్ని కూడా రాత్రిపూట పీడకలలు వేధిస్తున్నట్టైతే ప్రతి రోజూ రాత్రి రెండు బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల అది చెడు కలల నుంచి బయటపడటానికి మీకు సహాయపడుతుంది. చెడు కన్ను అస్సలు మంచిది కాదు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అయితే మీ ఇంటిని ఎవరిదైనా చెడు కన్ను తాకినట్టైతే రాత్రిపూట రెండు బిర్యానీ ఆకులను కాల్చాలి. ఇది చెడు కంటి దోషం ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే వాస్తు దోషాలతో ఇబ్బంది పడేవారు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా రాత్రిపూట ఇంట్లో బిర్యాని ఆకును కాల్చడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు.