Site icon HashtagU Telugu

Tirtha: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Tirtha

Tirtha

సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ పూజారి లేదా పురోహితులు అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పాదోదకం పావనం అనే మంత్రాన్ని చెబుతూ తీర్ధాన్ని మూడు సార్లు భక్తులు చేతిలో వేస్తారు. దేవాలయాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ కూడా పూజ తరువాత తీర్థప్రసాదాలు హారతి తీసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది తీర్థం తీసుకున్న తర్వాత చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. అదేమిటంటే తీర్థం తీసుకునే వెంటనే ఆ చేయిని తలపై రాసుకుంటూ ఉంటారు. కొందరు చేతులు కడిగేసుకుంటూ ఉంటారు.

తీర్థం తీసుకున్నాక చేయి తలకు రాసుకోవడమే సరికాదంటున్నాయి శాస్త్రాలు. ఎందుకంటే సాధారణంగా గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అంటే అందులో పంచదార, తేనె వేస్తారు కాబట్టి అవన్నీ తలకు రాసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అలా తలకు రాసుకోవడం అన్నది మంచిది కాదు. తీర్థం తీసుకున్నప్పుడు చేయి ఎంగిలి అవుతుంది. ఆ ఎంగిలి చేతిని కడుక్కోవాలి కానీ తలకు రాసుకోరాదు. తీర్థం తీసుకున్నాక స్వామి వారి శఠకోపం తలపై పెడతారు.

ఎంగిలి చేయి తలపై రాసుకుంటే స్వామివారి పాదాలుగా భావించే శఠకోపం అపవిత్రం అవుతుంది. తీర్ధం తీసుకున్న తర్వాత ఆ చేతిని కళ్ళకు అడ్డుకోవడం ఎంతో మంచిది. అయితే తీర్థం తీసుకున్నప్పుడు మూడు సార్లు ఎందుకు తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. మొదటి సారి తీర్థం తీసుకోవడం వల్ల మానసిక, శారీరక శుద్ధి జరుగుతుంది. రెండవ సారి తీర్థం తీసుకోవడం వల్ల న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. మూడవ సారి దేవదేవుడుకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ తీర్థం తీసుకోవాలి.

Exit mobile version