మాములుగా పూజ చేసేటప్పుడు పూజలో పువ్వులు ఉండటం తప్పనిసరి. పువ్వులు లేకుండా పూజ పూర్తి కాదు అని చెప్పాలి. అంతేకాకుండా పువ్వులు లేకుండా పూజ చేసిన కూడా అది అసంపూర్ణం అని చెప్పాలి. ఇకపోతే పూజ చేసిన తర్వాత పువ్వులను బయట పడేస్తూ ఉంటాం. ఇంకొందరు పువ్వులను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంతకి పూజలో ఉపయిగించే పువ్వులను ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నైవైద్యం లేకపోయినా పువ్వులు సమర్పించి దీపం పెట్టి నిత్య పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే పూజలో సమర్పించే పుష్పాల గురించి మాత్రం చాలామందికి ఒక సందేహం ఉంటుంది. పువ్వులను వాడిన తరువాత వాటిని తిరిగి ఉపయోగించుకుంటే బాగుంటుందని అనుకుంటారు. పూజ చేసేటప్పులు దేవుడికి పువ్వులు పెట్టడం తప్పనిసరి. అయితే పూజ కోసం వాడిన పువ్వులను చాలామంది పడేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదట. చాలామంది పువ్వలను నదిలో, పారే నీటిలో వేస్తుంటారు. దీని వెనుక కారణం దేవుడి పూజకు వాడిన పువ్వులను ఎక్కడంటే అక్కడ వేస్తే వాటిని తొక్కుతామని, ఇలా నదిలో, నీటిలో పువ్వులను అస్సలు విసిరేయకూడదట.
దీని వల్ల పర్యావరణం దెబ్బతింటుంది అంటున్నారు పండితులు. దేవుడి పూజ కోసం వాడిన పువ్వులను అక్కడ ఇక్కడ విసిరే బదులు వీటితో కంపోస్ట్ తయారు చెయ్యడం సులభం. అంటే ఈ పువ్వులను వ్యర్థాలతో కలపడం కాదు పువ్వులను ఏదైనా చెట్టు మొదట్లో లేదా మట్టిలో కలపాలి. ఇది మట్టికి పోషణ ఇస్తుందట. ఆ మట్టిలో నాటిన మొక్కలలో పచ్చదనం పెంచుతుందని చెబుతున్నారు. దేవుడి పూజకు వాడిన పువ్వులను ఈ మధ్యన ధూప్ స్టిక్స్, కోన్స్ తయారు చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి తయారు చేసి ఇంట్లో సువాసన కోసం ఉపయోగించ వచ్చు కానీ వీటిని తిరిగి దేవుడి పూజలో ఉపయోగించకూడదట.